వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి భయపడే చంద్రబాబు హిందుత్వ అజెండా , వాళ్ళను జనం నమ్మరు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్

|
Google Oneindia TeluguNews

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాష్ట్రంలో చంద్రబాబు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడం అజెండాగా పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేసిన వంశీ బిజెపి ఎక్కడ బల పడుతుందో అన్న అనుమానంతోనే చంద్రబాబు మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు ఏం చేసినా ప్రజలకు అంతా తెలుసన్నారు.

చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయ్ ; దేవినేని ఉమ ఒక లోఫర్ : ధ్వజమెత్తిన వల్లభనేని వంశీచంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయ్ ; దేవినేని ఉమ ఒక లోఫర్ : ధ్వజమెత్తిన వల్లభనేని వంశీ

ప్రజలు టిడిపి, బిజెపిలను నమ్మే పరిస్థితి లేదు

ప్రజలు టిడిపి, బిజెపిలను నమ్మే పరిస్థితి లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అభివృద్ధిని చూస్తున్న ప్రజలు టిడిపి, బిజెపిలను నమ్మే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు.చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన వల్లభనేని వంశీ బిజెపికి భయపడే చంద్రబాబు హిందూ అజెండాను ఎత్తుకున్నారని, ధర్మ పరిరక్షణ యాత్ర పేరుతో హిందూ ప్రజల మెప్పు పొందడం కోసం నానా తిప్పలు పడుతున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు ఏం చేసినా ప్రజలు నమ్మరని వంశీ పేర్కొన్నారు.

Recommended Video

Vallabhaneni Vamsi Complaints To Police On Morphing Photos In Social Media
ఏ రాజ్యాంగం ప్రకారం కరకట్ట మీద అక్రమ నిర్మాణం చేసి నివసిస్తున్నారు?

ఏ రాజ్యాంగం ప్రకారం కరకట్ట మీద అక్రమ నిర్మాణం చేసి నివసిస్తున్నారు?

40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్పుకునే చంద్రబాబు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా బాధ్యతతో ప్రవర్తించాలని వల్లభనేని వంశీ హితవుపలికారు

. ఒకపక్క రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే, హడావుడిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన వంశీ, ఎన్నికలు ఆలస్యమైతే చంద్రబాబు కు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం రాజ్యాంగ ప్రస్తావన తీసుకు వచ్చే చంద్రబాబు, ఏ రాజ్యాంగ ప్రకారం కరకట్ట పై అక్రమ కట్టడాన్ని నిర్మించుకొని నివాసముంటున్నారు చెప్పాలని నిలదీశారు.

తెలంగాణలోజీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కనీసం ప్రచారం చెయ్యలేదు .. జాతీయ పార్టీనా ?

తెలంగాణలోజీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కనీసం ప్రచారం చెయ్యలేదు .. జాతీయ పార్టీనా ?

చంద్రబాబుకు ఎన్నికలంటే భయం పట్టుకుందని విమర్శించారు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదని, జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో పోటీ చేసినా ప్రచారానికి సాహసించ లేదని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. చంద్రబాబు తనను జాతీయ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అబద్దాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్ముతున్నారని, అందులో భాగంగానే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని వల్లభనేని వంశీ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏది చేసినా స్వలాభం లేకుండా చేయడంటూ వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు.

English summary
Gannavaram MLA Vallabhaneni Vamsi was incensed that Chandrababu's agenda was to divide the caste and religion in the state. Vamsi, who has expressed displeasure over the attitude of opposition leader Chandrababu, has accused Chandrababu of engaging in religious politics out of suspicion of where the BJP will gain strength. He said Whatever Chandrababu did, the people knew everything.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X