వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్సెన్షన్ వేటు.. టీడీపీ కఠిన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వెంట తాను నడుస్తానని బహిరంగంగా ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. పార్టీ మారుతున్నానని సంకేతాలు పంపడంతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రకటించారు. మరోవైపు పార్టీ అధినేతల చేసిన వ్యాఖ్యలకు సంజాయిషి ఇవ్వాలని కోరనున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పార్టీ వేటు పడింది. ఆయన్ను పార్టీనుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన పార్టీకి వ్వతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై సంజాయిషి ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించిన వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నుండి పంపించేందుకు తనపై తప్పుడు వార్తలు రాయించారని, అయితే వాటిపై పార్టీ తరఫున ఎలాంటీ చర్య తీసుకోలేదని అన్నారు. ఇక అధికార వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరునెలలు కూడ కాకముందే దీక్షలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇక అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడ ఆయన స్పష్టం చేశారు.

 MLA Vallabhaneni Vamsi suspended from TDP

గురువారం వంశీ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకొన్న టీడీపీ అధ్యక్షుడు శుక్రవారం ఉదయమే పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. నాయకులతో విస్తృతస్థాయి చర్చలు జరిపిన అనంతరం వంశీపై తీవ్ర నిర్ణయాన్ని తీసుకొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వంశీపై సస్పెన్షన్ వేటు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

English summary
Vallabhaneni Vamsi suspended from TDP: After meeting with Important leaders, TDP Chief Chandrababu took the seriouse decision on Vallabhaneni Vamsi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X