వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే విడదల రజనీ సమయస్పూర్తి: సీఎం ఆఫీస్ పేరుతో మోసాలు చేసే కేటుగాడికి చెక్

|
Google Oneindia TeluguNews

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీని బురిడీ కొట్టించాలని ప్రయత్నించిన ఓ మోసగాడు అడ్డంగా బుక్కయ్యాడు. అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఘరానా మోసం బారినపడకుండా చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజినీ తప్పించుకోవడమే కాకుండా, భారీ మొత్తంలో రుణాలు ఇస్తామంటూ ప్రభుత్వం పేరు చెప్పి మోసం చేస్తున్న సదరు వ్యక్తిని పోలీసులకు పట్టించారు.

జగన్ మాట్లాడమన్నారంటూ... ఎమ్మెల్యే రజనీకి భారీ రుణం ఇస్తామని ఫోన్

జగన్ మాట్లాడమన్నారంటూ... ఎమ్మెల్యే రజనీకి భారీ రుణం ఇస్తామని ఫోన్

అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజినీనే మోసం చేసే ప్రయత్నం చేశాడు ఓ ఘనుడు . ఎమ్మెల్యే రజనీకి ఫోన్ చేశాడు. సీఎం కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అంతేకాదు మీతో మాట్లాడమని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు అని చెప్పి ఎమ్మెల్యే రజినీని కూడా నమ్మించాడు. భారీ మొత్తంలో రుణాలు ఇస్తామని, అయితే అందుకు ముందు కొంత నగదు చెల్లించాల్సి ఉంటుంది అంటూ ఎమ్మెల్యే రజనీతో మాట్లాడారు.

చాకచక్యంగా మోసగాడిని పట్టించిన విడదల రజనీ

చాకచక్యంగా మోసగాడిని పట్టించిన విడదల రజనీ

అనుమానం వచ్చిన రజిని చాకచక్యంగా వ్యవహరించారు. అతనితో మాట్లాడి అతని నుండి అన్ని వివరాలు కనుక్కున్నారు. ఈ సమయంలో విశాఖకు చెందిన జగజ్జీవన్ అనే పేరుతో సిఎం కార్యాలయంలో ఎవరైనా పని చేస్తున్నారా అని రజనీ సీఎం కార్యాలయ అధికారులను వాకబు చేశారు. అలాంటి పేరుతో ఎవరూ పనిచేయడం లేదని నిర్ధారించుకున్న తరువాత అతనితో ఫోన్లో మాట్లాడుతూనే డీజీపీతో పాటు గుంటూరు అర్బన్ ఎస్పీకి విషయాన్ని చేరవేశారు. అతను ఫోన్ మాట్లాడుతున్న ప్రదేశాన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు కూడా మోసగాడి కాల్

ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు కూడా మోసగాడి కాల్

గతంలో రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు కూడా ఇదే వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు అడిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కడప జిల్లా రాయచోటి కి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కి ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు జగ్జీవన్ రావ్ అని పరిచయం చేసుకుని, సీఎం ఆఫీస్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. 50 వేల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రభుత్వం 25 లక్షల రుణం ఇస్తుందని ఎమ్మెల్సీకే చెప్పిన అతను తెలంగాణలోని జంగారెడ్డిగూడెం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను ఆమెకు పంపించారు.

రాయచోటి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ

రాయచోటి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ

ముఖ్యమంత్రి కార్యాలయం పేరు చెప్పడంతో అనుమానం వచ్చిన జకియా ఖానమ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. దీంతో సీఎం కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు పేరుతో ఎవరైనా ఉన్నారా అని ఆరా తీసిన శ్రీకాంత్ రెడ్డి, ఇది పక్కా ఫ్రాడ్ కాల్ గా గుర్తించి రాయచోటి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించారు. అదే కేటుగాడు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీకి కాల్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.

Recommended Video

YSR Asara Scheme For SHGs : 8 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు బెనిఫిట్, రూ.6345 కోట్లతో !
చిలకలూరిపేట ఎమ్మెల్యేనా.. మజాకా !!

చిలకలూరిపేట ఎమ్మెల్యేనా.. మజాకా !!

సీఎం కార్యాలయం పేరుతో మోసం చేస్తున్న సదరు వ్యక్తిని విచారణ చేస్తున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశ పెడతామని చెప్తున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన, సీఎం కార్యాలయం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడ్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని చాకచక్యంగా పట్టించారు. ఇక ఈ విషయం తెలిసిన నియోజకవర్గ ప్రజలు చిలకలూరిపేట ఎమ్మెల్యే నా... మజాకా అంటూ ఈ సంఘటనపై చర్చించుకుంటున్నారు.

English summary
Chilakaluripet MLA Vidadala Rajini booked a fraudster who tried to cheat her. The Chilakaluripeta MLA Rajani acted wisely with the utmost timing and booked the fraudlent who also called tho an MLC and says CM office name .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X