వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీలోకి కాంగ్రెసు ఎమ్మెల్యే జంప్

By Pratap
|
Google Oneindia TeluguNews

MLA Vijayakumar to quit Congress and jump into YSRCP
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు తైనాల విజయకుమార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనపై పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పు పడుతూ ఆయన కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకున్నారు.

ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీ అవమానపరిచిందని, సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు.

నిజానికి నిరుడు జులై 30వ తేదీననే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాననిి, అయితే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ప్రజల వెనక ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్నాళ్లూ ఆగానని ఆయన చెప్పారు. ఆదివారంనాడు ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.

మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు ధర్మాన ప్రసాద రావు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆయనకు కూడా 9వ తేదీనే ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.

English summary
Congress MLA T Vijayakumar has resigned from Congress and decided to join in YS Jagan's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X