• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసెంబ్లీలో మంత్రులను నిలదీసిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు

By Pratap
|

అమరావతి: మంత్రుల తీరుపై శాసనసభలో సొంత పార్టీ శానససభ్యులే అసహనం వ్యక్తం చేశారు. వారిని ప్రశ్నలతో నిలదీశారు. అసెంబ్లీలో జీరో అవర్ జరుగుతున్న తీరుపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడారు.

జీరో అవర్ అనేది చాలా ప్రాధాన్యమైన సమయమని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అంశాలు, తక్షణ సమస్యలను జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావిస్తారని మోదుగుల చెప్పారు. కానీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఏడాది తర్వాత ఇంటికి రావడం బాధాకరమని అన్నారు.

1866లో స్థాపించిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌‌కు 150 సంవత్సరాల పండుగ చేయాలని 2016లో పురపాలక మంత్రిని అడిగితే ఇంత వరకూ ఎటువంటి సమాధానం రాలేదని విమర్శించారు. జీరో అవర్‌లో అడిగితే ఎంతసేపు చూస్తాం, చేస్తాం అనడం తప్ప స్పష్టమైన సమాధానాలు రావడం లేదని ఆయన అన్నారు.

స్పష్టమైన వైఖరి ఉండాలి...

స్పష్టమైన వైఖరి ఉండాలి...

శాసనసభలో జీరో అవర్‌ను చాలా స్పష్టమైన వైఖరితో నడపాల్సిన బాధ్యత స్పీకర్ ‌‌మీద ఉందని మోదుగుల అభిప్రాయపడ్డారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌‌కు 150 సంవత్సరాల పండుగ జరిపే బాధ్యతను పురపాలక శాఖ మంత్రి భుజస్కందాలపై వేసుకుంటారా? లేదా అనే దానిపై స్పష్టమైన వైఖరి చెప్పాలని ఆయన అడిగారు. జీరో అవర్‌లో సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు వారం లేదా పదిరోజుల్లో సంబధిత మంత్రులు సమాధానమిచ్చేలా మరోసారి మంత్రులకు సూచించాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

స్పందించిన మంత్రి అచ్చెన్న

స్పందించిన మంత్రి అచ్చెన్న

జీరో అవర్‌లో ప్రస్తావనకు వచ్చిన ప్రతీ విషయంపై సంబంధిత మంత్రులు సమాధానమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు గతంలోనే ఆదేశాలు ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఇక మీదట సభ్యులు ప్రస్తావించే ప్రతీ విషయంపై తప్పకుండా వీలైనంత త్వరలోనే మంత్రి సమాధానాలు వచ్చేలా చూస్తామని అన్నారు. మోదుగుల అడిగిన విషయమై మంత్రికి వివరించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మద్యం షాపులపై విష్ణుకుమార్ రాజు..

మద్యం షాపులపై విష్ణుకుమార్ రాజు..

మద్యం షాపుల విషయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఆబ్కారీ విధానం ప్రకారం మద్యం షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చునా అని సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. కేవలం దేవాదాయ శాఖలో నమోదైన దేవాలయాలు,బడులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల లోపు పెట్టడానికి వీల్లేదనే విధానం ఉంది కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.

దేవాలయాల విషయానికి వస్తే...

దేవాలయాల విషయానికి వస్తే...

దేవాదాయ శాఖలో నమోదైన దేవాలయాలకు వంద మీటర్ల లోపు మద్యం దుకాణాలు పెట్టకూడదని, అయితే రిజిస్టర్ కానీ దేవాలయాల సమీపంలో మద్యం షాపులు పెట్టుకోవచ్చా అని ఆయన అడిగారు. ఈ విషయాన్ని మంత్రి ఎలా అంగీకరించారో తెలియడం లేదని అన్నారు.

అవి గుడులు కావా..

అవి గుడులు కావా..

ఎండోమెంట్‌‌లో నమోదైన దేవాలయం వెళ్లి పూజలు చేస్తేనే పుణ్యం వస్తుందా, ఎండోమెంట్‌‌లో రిజిస్టర్‌‌కానీ దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తే పుణ్యం రాదా? అని విష్ణుకుమార్ రాజు అడిగారు. ఎండోమెంట్‌‌లో రిజిస్టర్ కానిది దేవాలలయం కాదా అని ప్రశ్నించారు. ఎండోమెంట్‌‌లో రిజిస్టర్ కాని దేవాలయాల పక్కనున్న మద్యం షాపులపై కూడా పాలసీ తీసుకురాకుంటే పైనున్న దేవుళ్లు కూడా ఒకరినొకరు విభేదించుకునే పరిస్థితి వస్తుందని ఆయన చమత్కరించారు. విష్ణు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని ఎక్సైజ్ మంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్యాల రావు హామీ ఇచ్చారు.

English summary
MLAs Modugula Venugopal Reddy and Vishnukumar Raju questioned ministers in Andhra Pradesh assembly during zero hour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X