అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు కరుస్తున్నారట: 'తానే తెలివైనవాడిననే భ్రమలో చంద్రబాబు'

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధాని సెంటిమెంట్‌ను దోపిడీకి అనుకూలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మలచుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య విమర్శించారు. శనివారం ఆయన ఇందిరాభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

అమరావతి ప్రజా అమరావతి కాదని రైతుల దగ్గర చంద్రబాబు భూములు లాక్కున్నారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం స్విస్ చాలెంజ్ పద్ధతిలో కాకుండా గ్లోబల్ టెండర్ల పద్దతిలో పిలవాలని డిమాండ్ చేశారు. తనకు నచ్చినవారికి భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు.

రాజధాని నిర్మాణంలో ప్రతిపక్షాలను ఏ మాత్రం సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాజరికంలో కూాడ ఇలా జరగదని దుయ్యబట్టారు. మీడియా సమావేశాల్లో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన చంద్రబాబు, ప్రశ్నిస్తే వారిపై పడి కరుస్తున్నారని ఎద్దేవా చేశారు.

rama

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం మంచిదికాదన్నారు. మీడియాను నియంత్రించాలని చంద్రబాబు చూస్తున్నారని, అలా ఎన్నింటిపై నిషేధం విధిస్తారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు ప్రజలు ఆయన్ను, ఆయన పార్టీని బ్యాన్ చేస్తారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

అధికార పక్షానికి, ప్రతిపక్షానికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రాజధాని నిర్మాణంలో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని ఆయనకు ఆయనే
సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.

స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ప్రపంచం మొత్తం వ్యతిరేకించిందని, అలాంటిది పద్ధతిని మన దగ్గర చంద్రబాబు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన రహస్య ఎజెండాను పక్కనపెట్టాలని ఆయన అన్నారు. రాజధానిలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

రాజధాని నిర్మాణంలో ఎవరూ అర్హులు అయితే వాళ్లకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. వెంటనే రాజధాని నిర్మాణంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం ఏర్పాటుకు 45 రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు.

ప్రపంచంలో తానే తెలివైనవాడిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని, ఆ తెలివితేటలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని ఆయన వ్యాఖ్యానించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే అమ్మేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యం చేయడం వల్లే కేంద్రం నిధులు సరిగా రావడం లేదని విమర్శించారు.

English summary
Congress mlc c ramachandraiah fires on chandrababu over swiss challenge method.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X