వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆట మొదలైంది.. కానీ: 'కడప'కు జగన్ ఇలా కౌంటర్, చంద్రబాబుకు షాక్

ఆంధ్రప్రదేశ్‌లో ఆట మొదలైంది! ఈ విషయాన్ని కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పగా, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైసిపి నేతలు అభిప్రాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆట మొదలైంది! ఈ విషయాన్ని కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పగా, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైసిపి నేతలు అభిప్రాయపడ్డారు.

వ్యూహమా?: 'బీజేపీలో వైసిపి విలీనమా.. ఇప్పుడే కాదని జగన్ చెప్పారా?'వ్యూహమా?: 'బీజేపీలో వైసిపి విలీనమా.. ఇప్పుడే కాదని జగన్ చెప్పారా?'

ఇటీవల ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కడప, కర్నూలు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. మూడుచోట్ల టిడిపి గెలిచింది. 34 ఏళ్ల తర్వాత కడపలో వైయస్ కుటుంబానికి షాకిస్తూ.. గెలవడం టిడిపికి పట్టలేని సంతోషాన్ని ఇచ్చింది.

కడపలో టిడిపి గెలుపు వెనుక మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిల వ్యూహంతో పాటు చెంగల్రాయుడు, ఆదినారాయణ రెడ్డి వంటి జిల్లా నేతల చేరిక కలిసి వచ్చిందని అంటున్నారు.

 ఆట మొదలైందని..

ఆట మొదలైందని..

డపలో గెలుపు టిడిపి నేతలకు.. స్వయంగా సీఎం చంద్రబాబుకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా గెలుస్తామని చంద్రబాబు, టిడిపి నేతలు ప్రకటించారు. తమ తదుపరి టార్గెట్ పులివెందుల అని ప్రకటించారు.

కడప గెలుపుతో ఇప్పుడే ఆట మొదలైందని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. వైసిపి అధినేత జగన్‌కు ఇది పెద్ద దెబ్బ అని, వచ్చే ఎన్నికల్లో జగన్ సహా వైసిపి నేతలు ఎవరూ గెలవరని టిడిపి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

చంద్రబాబు కడపలో పోటీ.. జగన్ సవాల్

చంద్రబాబు కడపలో పోటీ.. జగన్ సవాల్

కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి టిడిపి గెలిచిందని, పులివెందులలో గెలుస్తామని టిడిపి నేతలు చెబుతున్నారని, ఆ దమ్ముంటే 21 మంది ఎమ్మెల్యేలు తమ వారు టిడిపిలో చేరారని వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ సవాల్ చేశారు. అంతేకాదు, కడపలో గెలుస్తామనే దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కడప నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు.

ఇక్కడ రివర్స్.. దీంతో జగన్ కౌంటర్

ఇక్కడ రివర్స్.. దీంతో జగన్ కౌంటర్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను టిడిపి గెలుచుకొని సంబరాల్లో మునిగిపోగా... ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీకి షాక్ తగిలింది. పశ్చిమ రాయలసీమ నుంచి వైసిపి అభ్యర్థి గోపాల్ రెడ్డి గెలిచారు. టిడిపి అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిదు చోట్ల జరిగాయి. నాలుగు చోట్ల టిడిపి అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో వైసిపి దీనిని చూపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను కొని ఓట్లు వేయించుకొని గెలిచారని, కానీ ఉపాధ్యాయ, పట్టభద్రులు మాత్రం టిడిపిని తిరస్కరించారని వైసిపి చెబుతోంది. తద్వారా జనాల్లో టిడిపికి ఆదరణ లేదని తెలుస్తోందని అంటున్నారు.

టిడిపికి దెబ్బ

టిడిపికి దెబ్బ

చంద్రబాబుకు సొంత జిల్లా చిత్తూరులోనే షాక్ తగిలింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూరపు రాయలసీమ ఎన్నికల్లో విఠల బాలసుబ్రహ్మణ్యం గెలిచారు. టిడిపి అభ్యర్థి వాసుదేవనాయుడు మట్టి కరిచారు. అయిదింట నాలుగు టిడిపి గెలుచుకోలేదు. ఒక స్థానంలో (ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోః బిజెపి-టిడిపి ఉమ్మడి అభ్యర్థి మాధవ్‌ గెలుపొందారు. తన ప్రత్యర్థి, పీడీఎఫ్‌ అభ్యర్థి అజా శర్మపై 9215 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

English summary
After MLC elections results, Now Telugudesam and YSR Congress Patty leader blaming each others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X