నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటమితో ఆనం తీవ్ర వ్యాఖ్యలు: మీరు పార్టీ మారొచ్చు కానీ.. జగన్‌కు షాక్

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసిపిలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలోని కొందరు నమ్మించి మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి ఆనం విజయ కుమార్ రెడ్డి చేస

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసిపిలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలోని కొందరు నమ్మించి మోసం చేశారని ఆ పార్టీ అభ్యర్థి ఆనం విజయ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

స్థానిక ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడైన తర్వాత జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఘాటుగానే మాట్లాడారు.

<strong>ఆట మొదలైంది.. కానీ: 'కడప'కు జగన్ ఇలా కౌంటర్, చంద్రబాబుకు షాక్</strong>ఆట మొదలైంది.. కానీ: 'కడప'కు జగన్ ఇలా కౌంటర్, చంద్రబాబుకు షాక్

మరోవైపు కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహార శైలిపైనా జగన్‌కు ఫిర్యాదులు వెళ్లినట్టుగా చెబుతున్నారు.

తొలుత ఎవరూ ముందుకు రాలేదు

తొలుత ఎవరూ ముందుకు రాలేదు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరులో వైసిపి నుంచి పోటీ చేసేందుకు తొలుత ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ తర్వాత జగన్ అన్నింటికి హామీ ఇవ్వడంతో తెరపైకి ఆనం విజయ కుమార్ రెడ్డి పేరు వచ్చింది.

మొదట కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి అభ్యర్థిని తీసుకువస్తామని జగన్‌కు హామీ ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ మొదలై నామినేషన్ ప్రక్రియ కొనసాగినా రామిరెడ్డి తీసుకువస్తామన్న అభ్యర్థి పత్తా లేదు. పలు పరిణామాల నేపథ్యంలో ఆనం విజయ్ కుమార్‌ను రంగంలోకి దింపారు.

ఓటమి తర్వాత అసంతృప్తులు

ఓటమి తర్వాత అసంతృప్తులు

ఆయనను రంగంలోకి దింపితే గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని, ఆత్మ ప్రబోధానుసారం ఓటింగ్‌ జరిగితే గెలుపు వైసిపిదేనని ఆ పార్టీ నేతలు భావించారు. టిడిపి నేతలకు దీటుగా వైసిపి నేతలు వ్యూహాలు రచించారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో... టీడీపీ నేతలు కూడా జాగ్రత్తపడి వైసీపీ నేతలకు దీటుగా ఓటర్లను క్యాంపులకు తరలించారు. టిడిపి క్యాంపుకు తరలించినా.. వైసిపి క్రాస్ ఓటింగు పైన నమ్మకం పెట్టుకుంది. వైసిపి నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. కానీ టీడీపీ ఎత్తుకుపై ఎత్తులు వేసింది.

అయితే, కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారశైలిపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధినేత జగన్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

విజయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం

విజయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం

ఫలితాలు వెల్లడైన తర్వాత వైసిపి అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ బయటకు రాలేదు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని ముఖ్య నేతలెవరూ హాజరు కాలేదు. ఆనం తనయుడు కార్తీక్ రెడ్డి ఒకరిద్దరు అనుచరులతో కలిసి విజయ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో కొంత ఘాటైన వ్యాఖ్యలు సంధించారు.

డబ్బులు డిమాండ్ చేశారని..

డబ్బులు డిమాండ్ చేశారని..

రూ.3 నుంచి 4 లక్షల వరకు డిమాండ్‌ చేసినట్లు ఓ కార్పొరేటర్‌పై ఆయన ధ్వజమెత్తారు. ఆత్మ విమర్శ చేసుకోవాలంటూనే పార్టీ కేడర్‌, నేతల కన్నా ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని చెప్పుకువచ్చారు. కొందరు విశ్వాసఘాతకులు నమ్మించి మోసం చేశారన్న ఆయన ఆరోపణ ఆ పార్టీలో చర్చకు దారి తీస్తోంది. ఎవరు ఆ విశ్వాసఘాతకులు అంటూ కేడర్‌లో అంతర్మథనం మొదలైంది.

ఆ వ్యాఖ్యలపై వ్యతిరేకత

ఆ వ్యాఖ్యలపై వ్యతిరేకత

పార్టీ ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయారని చేసిన ఆరోపణలపై అప్పుడే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడే పార్టీ బలమెంత... ఉన్న ఓటర్లలో ఎందరు పార్టీకి మద్దతు ఇస్తారన్నది ఆనం విజయ కుమార్ రెడ్డి అంచనా వేసి ఉండాల్సిందని అంటున్నారు. అలాగే, నేతలు గెలిచినప్పుడు తమను పట్టించుకున్న సందర్భాలు లేవని, అలాగే తాము పార్టీ వీడుతున్నప్పుడు పట్టించుకున్న వారు లేరన్నారు.

ఆనం విజయ్ కుమార్ పార్టీ మారలేదా

ఆనం విజయ్ కుమార్ పార్టీ మారలేదా

అలాంటి సంఘటనలన్నీ మరిచి ఇప్పుడు అనైతిక చర్యలంటూ గగ్గోలు పెడుతూ ఆ రోజు పార్టీ మారినప్పుడే కాలి చెప్పుతో కొట్టి ఉండాలంటూ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారం తీసుకు వస్తోంది. కాంగ్రెస్‌లో ఉన్న ఆనం విజయ కుమార్ రెడ్డి వైసీపీలో చేరలేదా? అది తప్పు కానప్పుడు తాము పార్టీ మారితే తప్పేమిటని స్థానిక సంస్థల ప్రతినిధులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

పార్టీపట్ల ఎంతో బాధ్యతగా కొనసాగి ఓట్లు వేయబట్టే స్వల్ప మెజారిటీతో ఓటమి చెందామని గుర్తు పెట్టుకోకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానిక సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు గడిచినా కనీసం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎక్కడున్నారని అడిగిన నాథుడే లేడంటున్నారు. అలాంటిది ఈ ఎన్నికల పుణ్యమా అని గుర్తించి కొంత ఆర్ధిక సర్దుబాటు చేయడంతో తమ కుటుంబాల్లో వెలుగులు వచ్చాయంటున్నారు.

English summary
YSR Congress Party leader Anam Vijay Kumar Reddy unahappy with party leaders for his defeat in SPS Nellore district MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X