వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్లుండి ఎన్నిక‌ల షెడ్యూల్ : వాట‌న్నింటికీ బ్రేక్ : రేపు కీల‌క క్యాబినెట్‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : Ap MLC Elections Schedule May Release On 14th Feb

ఏపిలో ఎన్నిక‌ల సండ‌ది ఊపందుకుంది. ప్ర‌భుత్వం వ‌రుస‌గా వ‌రాలు ప్ర‌క‌టిస్తోంది. ప్ర‌తిప‌క్షం ప్ర‌భుత్వం పై విరుచు కు ప‌డుతోంది.ఈ ప‌రిస్థితుల్లో ఏపి లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తోంది. ఎల్లుండి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో..కొత్త కార్య‌క్ర‌మాల‌కు బ్రేక్ ప‌డ‌నుంది. ఇక‌, ఏపి ప్ర‌భుత్వం కీల‌క మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హి స్తోంది. దీనిలో ప‌లు పెండింగ్ నిర్ణ‌యాల‌కు ఆమోదం తెల‌ప‌నుంది.

ఎల్లండి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్..

ఎల్లండి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్..

ఏపి లో కొత్త ప‌ధ‌కాల‌కు బ్రేక్ ప‌డ‌నుంది. ఈ నెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌, దాంతోపాటే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. రాష్ట్రప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడానికీ, అభివృద్ధి కార్యక్రమాలకు అప్పటినుంచి శంకుస్థాపన చేసేందుకూ వీలు ఉండదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు వర్తించే అవకాశముంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ కోడ్‌ వర్తిస్తుంది. మిగతా ఆరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు లేనందున ఆయా జిల్లాలకు వర్తించదు. దాదాపుగా సగం పైగా రాష్ట్రంలో మూడు రోజుల్లో కోడ్‌ అమల్లోకి రానుంది. ఇది దాదాపుగా ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ఆ తరువాత మళ్లీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది.

ఆ రోజున సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్..

ఆ రోజున సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్..

ఇక‌, ఏ క్ష‌ణం అయినా సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌చ్చ‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ఫిబ్రవరి 28 లేక మార్చి 4వ తేదీన ఈ కోడ్‌ రావొచ్చని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలోనే వస్తే, ఇక ఇటు ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్‌, ఆ వెంటనే సాధారణ ఎన్నికల కోడ్‌ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. మధ్యలో సమయం ఉండదు. ఒకవేళ మార్చి 4వ తేదీన సాధా రణ ఎన్నికల ప్రకటన వస్తే మాత్రం కోడ్‌కు నాలుగైదు రోజుల విరామం మధ్యలో ఉంటుంది. ప్రధాని నరేంద్రమోదీ మార్చి ఒకటోతేదీన విశాఖపట్నం రానున్నారు. కొన్ని పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అంటే అప్పటికి సాధా రణ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకపోవచ్చని భావిస్తున్నారు. మార్చి మొదటి వారంలోనే నోటిఫికేషన్‌ వస్తుందని...అందుకే ప్రధాని మార్చి 1న విశాఖ కార్యక్రమం పెట్టుకున్నారనేది ఏపి ప్ర‌భుత్వ అంచ‌నా.

అధికారికంగా కీల‌క నిర్ణ‌యాలు..

అధికారికంగా కీల‌క నిర్ణ‌యాలు..

ఎన్నిక‌ల షెడ్యూల్ కార‌ణంగా ఏపి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపే ప‌నిలో ప‌డింది. ఇందు కోసం 13న సాయంత్రం క్యాబినెట్ కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసారు. మరోవైపు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా...ఎన్నికల విధుల్లో భాగస్వాములు అయ్యే అధికారుల బదిలీలు, పోస్టింగులు కూడా ఉండవు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 103 మం ది డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీలు పూర్తిచేసింది. ఇంకోవైపు కోడ్‌ అమల్లో ఉండగా...కొత్తగా సంక్షేమ పథకాలను ప్ర భుత్వపరంగా ప్రకటించకూడదు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయకూడదు. కానీ సాధారణ పాలనకు సంబం ధించిన అంశాలూ, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధి అందించడం, ఇప్పటికే ప్రకటించిన కార్యక్రమాలను ముం దుకు తీసుకెళ్లడం లాంటివి చేసేందుకు ఇబ్బంది ఉండదు. దీంతో.. ఏపిలో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది.

English summary
Election schedule for MLC elections in Ap may release on 14th of this month. After that general elections schedule may come. In this View Ap Govt taking key decisions in 13th Cabinet meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X