వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ఆగ్రహం, మూర్తి సారీ: బెదిరిస్తున్నారు.. రాజ్‌‌కు ఏయూ విద్యార్థుల ఫిర్యాదు

ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థుల దెబ్బకు ఎమ్మెల్సీ, టిడిపి నేత ఎంవీవీఎస్ మూర్తి దిగొచ్చారు. ఏయూను దెయ్యాల కొంప అని అభివర్ణించినందుకు ఆయన ఆదివారం నాడు మహానాడు వేదికగా క్షమాపణలు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విశాఖ: ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థుల దెబ్బకు ఎమ్మెల్సీ, టిడిపి నేత ఎంవీవీఎస్ మూర్తి దిగొచ్చారు. ఏయూను దెయ్యాల కొంప అని అభివర్ణించినందుకు ఆయన ఆదివారం నాడు మహానాడు వేదికగా క్షమాపణలు చెప్పారు.

<strong>రేవంత్ హడావుడి.. ఏపీ నేతల ఆశ్చర్యం</strong>రేవంత్ హడావుడి.. ఏపీ నేతల ఆశ్చర్యం

ఆంధ్రా యూనివర్శిటీపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మూర్తి అన్నారు. ఏంవీవీఎస్ మూర్తి గీతం విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు. తన వర్సిటీ ప్రతిష్ట పెంచుకునేందుకు ఏయూను మసకబార్చాలని చూస్తున్నారని విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో ఆయన ఎట్టకేలకు తగ్గారు.

బేషరతు క్షమాపణ

బేషరతు క్షమాపణ

మహానాడు ఏర్పాట్ల సమయంలో పొరపాటున దొర్లిన మాటకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని మూర్తి తెలిపారు. యూనివర్శిటీ ఉపకులపతి, అధ్యాపకులు, విద్యార్థులు, మేధావులను క్షమించమని వేడుకుంటున్నట్లు చెప్పారు.

చంద్రబాబు ఆగ్రహంతో క్షమాపణ

చంద్రబాబు ఆగ్రహంతో క్షమాపణ

కాగా, అంతకుముందు మూర్తి వ్యాఖ్యలు, విద్యార్థుల ఆగ్రహాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఆయనకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబు సీరియస్ అవడంతో ఆయన తగ్గారని తెలుస్తోంది.

క్షమాపణలు ఆయన సంస్కారానికి నిదర్శనమని బాబు

క్షమాపణలు ఆయన సంస్కారానికి నిదర్శనమని బాబు

మూర్తి క్షమాపణలు చెప్పిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తాను మందలించానని తెలిపారు. మూర్తి క్షమాపణలు చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనం అన్నారు. మూర్తి స్వయంకృషితో పైకి వచ్చారన్నారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడన్నారు.

అందరూ ఇలాగే క్షమాపణ చెప్పాలి

అందరూ ఇలాగే క్షమాపణ చెప్పాలి

మాటల్లో తప్పుదొర్లితే హుందాగా క్షమాపణ చెప్పారన్నారు. అన్నీ సాధించిన వ్యక్తి, సమాజాంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి, గీతం వర్సిటీని పెట్టి చదువు చెబుతున్న వ్యక్తి బేషరతుగా క్షమాపణలు చెప్పారని, ఎవరైనా ఇలా తప్పు చేస్తే ధైర్యంగా క్షమాపణ చెప్పాలన్నారు. మూర్తి ఔన్నత్యాన్ని అందరూ మెచ్చుకోవాలన్నారు.

రాజ్‌నాథ్‌కు విద్యార్థుల ఫిర్యాదు

రాజ్‌నాథ్‌కు విద్యార్థుల ఫిర్యాదు

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఏయూ విద్యార్థులు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఏయూలో రాజకీయ కార్యక్రమాలు వద్దన్నందుకు టిడిపి నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. టిడిపి నేతల నుంచి తమకు ప్రాణహానీ ఉందన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందని చెప్పారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తోందన్నారు.

English summary
Telugudesam Party leader and MLC MVVS Murthy Apologies for his derogatory comments on Andhra University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X