వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'జగన్ దూరమవుతున్నారు, పులివెందుల నడివీధిలో 4వేలమంది రాలేదు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్

|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి సవాల్ చేశారు.

పులివెందుల నియోజకవర్గానికి జగన్ చేసింది ఏమీ లేదన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో పులివెందుల నడివీధిలో సమావేశం నిర్వహిస్తే 4వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

<strong>ఉమ సంచలనం: 'వైయస్ ఫ్యామిలీ గట్టు రట్టు చేయనున్న జేసీ బ్రదర్స్'</strong>ఉమ సంచలనం: 'వైయస్ ఫ్యామిలీ గట్టు రట్టు చేయనున్న జేసీ బ్రదర్స్'

గండికోట నుంచి పైడిపాళెంకు నీరు మళ్లించే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైన సమావేశానికి యాభై వేల మంది ప్రజలు హాజరయ్యారన్నారు. జగన్ ప్రజల విశ్వాసానికి దూరమవుతున్నారన్నారు.

వైయస్ పేరు చెప్పుకొని రాజకీయాలు

వైయస్ పేరు చెప్పుకొని రాజకీయాలు

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని ఇంకా రాజకీయాలు సాగిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలం నుంచి గండికోటకు నీరు వస్తాయని తెలిసే రైతులను మభ్యపెట్టేందుకు పులివెందులలో ధర్నా చేశారన్నారు.

వైసిపి ఎంపీలు రాజీనామా చేస్తే..

వైసిపి ఎంపీలు రాజీనామా చేస్తే..

జూన్‌లో వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ అంటున్నారని, రాజీనామా చేస్తే వైసీపీ మళ్లీ గెలవలేదన్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచైనా, కడప పార్లమెంటు నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.

అది జగన్‌కే చెల్లింది

అది జగన్‌కే చెల్లింది

జగన తీరు సరిగా లేదని సతీష్ రెడ్డి అన్నారు. ఆయన ప్రవర్తనను అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేయడం ద్వారా.. వైయస్ రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్న వారిని సైతం జైలుకు పంపడం జగన్‌‌కే చెల్లిందన్నారు.

బీటెక్ రవిదే గెలుపు

బీటెక్ రవిదే గెలుపు

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్‌ రవి విజయం తథ్యమన్నారు. 454 మంది టీడీపీ తరపున బీటెక్‌ రవికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు పథకాల కారణంగా వైసీ పీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా టీడీపీకి ఓటు వేస్తారన్నారు.

English summary
Telugudesam Party MLC Satish Reddy has challenged YSRCP chief YS Jagan on Pulivendula winning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X