వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ బీజేపీలో మారుతున్నపరిణామాలు: రాష్ట్ర అధ్యక్షునిగా సోము వీర్రాజు?

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎపి బీజేపీ నూతన అధ్యక్షుడిని నియమించే విషయమై పరిణామాలు మారుతున్నాయి. ప్రస్తుతం తెలుస్తున్నసమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఖరారు కావొచ్చని తెలుస్తోంది.

ఎపి బిజెపి నూతన అధ్యక్షుడిగా సోమూ వీర్రాజు పేరును మూడు రోజుల వ్యవధిలోపే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా మాజీ మంత్రి మాణిక్యాలరావుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చినా, ఏ కారణం చేతనో ఆయన ఈ పదవిని చేపట్టేందుకు అనాసక్తి చూపడంతో ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు పేర్లు చర్చకు వచ్చి చివరకు సోము వీర్రాజు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.

ముందు...మాణిక్యాలరావుకే ఛాన్స్

ముందు...మాణిక్యాలరావుకే ఛాన్స్

ఎపి వ్యవహారాలపై దృష్టి సారించనున్న రాం మాధవ్ తన ఛాయిస్ గా మాజీమంత్రి మాణిక్యాలరావును ఎంచుకున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కారణాలు ఏమైనా మాణిక్యాలరావు ఎపి బిజెపి అధ్యక్షుడి పదవి చేపట్టేందుకు ముందుకు రాలేదనే విషయం స్పష్టమయింది. తాను ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవిని అంత సమర్ధవంతంగా నిర్వహించలేనేమోనన్న సందేహం మాణిక్యాలరావు వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. అయితే అంతర్గతంగా మరో కారణం ఏమైనా ఉందేమో ప్రస్తుతానికైతే తెలియదు కాని ఆయన ఆ పదవిని చేపట్టేందుకు తానే నిరాకరించినట్లు ఆయన మాటలను బట్టే అర్థమవుతోంది.

మాణిక్యాలరావు ఏమన్నారంటే...

మాణిక్యాలరావు ఏమన్నారంటే...

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లాబీలో తనకు ఎదురుపడ్డ మాణిక్యాలరావును...కొత్త శత్రువులకు నమస్కారం అంటూ టిడిపి నేత కళా వెంకట్రావు పలకరించారు. అదే సమయంలో అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ మాణిక్యాలరావుకు...మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని అభినందించారు. అందుకు స్పందించిన మాణిక్యాలరావు తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిని కావడం లేదని...సోము వీర్రాజు అవుతున్నారని, వీర్రాజును తానే ప్రతిపాదించానని చెప్పారు...అందుకు నన్నపనేని మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాణిక్యాలరావే అని అంటున్నారని అన్నారు. అందుకు సమాధానంగా మీ టీడీపీకి సోము వీర్రాజు అయితేనే సరిపోతాడంటూ నవ్వుతూ అంటూ మాణిక్యాలరావు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

దీన్ని బట్టి...సోమూ వీర్రాజే

దీన్ని బట్టి...సోమూ వీర్రాజే

మాణిక్యాలరావు మాటలను బట్టి...తానే సోమూ వీర్రాజు పేరు ప్రతిపాదించానని స్పష్టం చేయడాన్ని బట్టి మూడు విషయాలు తేటతెల్లమవుతున్నాయి. ఒకటి బిజెపి అధిష్టానం మొదట ఎపి అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం ఇచ్చిన విషయం, రెండు ఆ పదవిని స్వీకరించేందుకు మాణిక్యాలరావు సుముఖంగా లేని విషయం, మూడు సోమూ వీర్రాజును ఈయనే ప్రతిపాదించడం వలన...తద్వారా సోమూ వీర్రాజే అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందనే విషయం స్పష్టమవుతోంది. అయితే మాణిక్యాలరావు ఈ పదవిని స్వీకరించేందుకు ముందుకు రాకపోయేసరికి...ఆ తరువాత కూడా ఈ పదవిని సోమూ వీర్రాజుకు కట్టబెట్టే విషయంపై బిజెపిలో సుదీర్ఘ చర్చే జరిగినట్లు తెలుస్తోంది. ఈ పదవిని సోమూ వీర్రాజుకు ఇవ్వాలా లేక మరో నేత కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వాలా అనే విషయమై ఈ చర్చ జరిగినట్లు సమాచారం. అయితే అంతిమంగా కన్నాకు కాకుండా సోమూ వీర్రాజుకే ఈ పదవిని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 చర్చ...ముగ్గురూ కాపునేతలే...

చర్చ...ముగ్గురూ కాపునేతలే...

అయితే ఎపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని చర్చించిన ముగ్గురు నేతల కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఎపిలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి కాకుండా ఎపిలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గానికే ఈ పదవిని కట్టబెట్టాలని బిజెపి ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మాణిక్యాలరావు రాష్ట్ర అధ్యక్షుడిగా అమలుచేయాల్సిన వ్యూహరచనలో తనకు అంత పట్టులేదని అభిప్రాయం వ్యక్తం చేశారని...ఇక కన్నా లక్ష్మీనారాయణను ఏ కారణం చేతనో బిజెపి అధిష్టానం ఆయనపై భరోసా ఉంచలేక పక్కనపెట్టిందని...ఇక సోమూ వీర్రాజు ముందు నుంచి ఈ పదవిని స్వీకరించేందుకు సిద్దంగానే ఉన్నా టిడిపిపై దుందుడుకు విమర్శలు చేస్తూ వస్తున్న ఆయనను వెంటనే ఎపి పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే వేరే సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని తర్జనభర్జనలు పడిన బిజెపి అధిష్టానం ప్రస్తుతం మరో ఛాయిస్ లేక ఆయననే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమిస్తోందని సమాచారం.

అంత సులువు కాదు...చాలా క్లిష్టం కూడా

అంత సులువు కాదు...చాలా క్లిష్టం కూడా

ప్రస్తుత పరిస్థితుల్లో ఎపి బిజెపి అధ్యక్షుడిగా ఎంపికైన ఎవరైనా అత్యంత కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది వాస్తవం. కారణం టిడిపితో అత్యంత తీవ్ర స్థాయిలో విభేధాలు నెలకొన్న ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీని, అందులోనూ రాజకీయంగా అనుభవంలోను, వ్యూహరచనలో సిధ్దహస్తుడైన చంద్రబాబు నేతృత్వంలోని ఆ పార్టీని ఢీ కొడుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగడం అంటే ఆషామాషీ కాదనేది అందరికీ తెలిసిన విషయమే. కేవలం విమర్శలు చేయడం వేరు...అధ్యక్ష పదవి చేపట్టాక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పార్టీని ముందుకు నడిపించడం వేరని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే అత్యంత బలమైన ప్రత్యర్థి టిడిపిని ఎదుర్కొంటూనే మరోవైపు ఇతర పార్టీలని కూడా ఢీ కొడుతూ ఎపిలో కునారిల్లి ఉన్న బిజెపిని బలోపేతం చేస్తూ ముందుకు సాగాల్సివుందనేది కళ్ల ముందు కనిపిస్తున్న నిజం...మరి ఈ సవాళ్లను ఎపి నూతన బిజెపి అధ్యక్షుడు ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే!

English summary
Amaravathi:Bharatiya Janata Party MLC Somu Veerraju is likely to replace Visakhaptnam MP and BJP A.P. President Kambhampati Haribabu. The announcement, however, It will be revealed in within three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X