నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ జడ్పీ ఛైర్మన్‌తో వాగ్వాదం: మైక్ విరగ్గొట్టిన వాకాటి

శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమైన తర్వాత సాగునీటిపై చర్చ జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ .

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: శనివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమైన తర్వాత సాగునీటిపై చర్చ జరిగింది. తెలుగుదేశం ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్ర రెడ్డి ఆయన మైక్‌ను కట్ చేశారు.

ఈ క్రమంలో సమావేశంలో వివాదం రగులుకుంది. తన మైక్ కట్ చేయడం పట్ల వాకాటి నారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మైక్ ఎందుకు కట్ చేశారంటూ.. మైక్‌ను కిందకు విసిరేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వాకాటికి మద్దతుగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇతర సభ్యులు నినాదాలు చేశారు.

MLC Vakati fires at Nellore ZP Chairman

వివాదం ముదురుతుండటంతో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను సముదాయించడంతో సమావేశం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. పది నిమిషాల అనంతరం సమావేశం మళ్లీ కొనసాగింది.

English summary
Telugudesam MLC Vakati Narayana Reddy on Saturday fired at Nellore ZP Chairman Raghavendra Reddy for cutting his mic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X