గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్ట్రెచర్ అడిగితే కుమ్మేశాడు, నేలపై ఈడ్చుకెళ్ళాడు, గుంటూరులో దారుణం

గుంటూరు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. రోగి సహాయకుడిపై ఆసుపత్రి ఎంఏల్ఓ తీవ్రంగా దాడి చేశాడు. నేలపై ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళాడు. ఈ ఘటనపై సూపరింటెండ్ కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. రోగి సహాయకుడిపై ఆసుపత్రి ఎంఏల్ఓ తీవ్రంగా దాడి చేశాడు. నేలపై ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళాడు. ఈ ఘటనపై సూపరింటెండ్ కు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

ప్రకాశం జిల్లాకు చెందిన కోటయ్య, నాగరాజు అనే ఇద్దరు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. కోటయ్యకు ఆరోగ్యం బాగాలేదు. అయితే ఆయనకు తోడుగా నాగరాజు వచ్చాడు.అయితే కోటయ్యను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్ళేందుకు స్ట్రెచర్ లేదు.

guntur hospital

ఈ విషయమై నాగరాజు ఆసుపత్రి ఎంఎల్ఓ దృష్టికి తీసుకెళ్ళాడు.అయితే దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంఏల్ఓ నాగరాజుపై విచక్షణరహితంగా దాడి చేశాడు.

నాగరాజును కొట్టుకొంటూ బయటకు తీసుకెళ్ళాడు. నేలపై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్ళాడు. ఈ ఘటన జరగుతున్న సమయంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు, వారి సహయకులు ప్రేక్షకులుగా చూస్తూ కూర్చుకొన్నారు.

అయితే ఈ ఘటనతో ఖంగుతిన్న నాగరాజు ఆసుపత్రి సూపరింటెండ్ కు ఫిర్యాదు చేశారు.అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దని ఆసుపత్రి సూపరింటెండ్ సూచించాడు. ఈ విషయమై విచారణకు ఆయన ఆదేశించారు. సీసీటీవి పుటేజీ ఆధారంగా ఎంఏల్ఓ నాగరాజుపై దాడి దృశ్యాలను పరిశీలించారు సూపరింటెండ్.

English summary
MLO attacked on a patient attendant in Guntur hospital on Friday.victim Nagaraju complaint to superintendent,he ordered to enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X