• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొబైల్ షాపు ఓనర్ కామపురాణం.. కస్టమర్లతో రాసలీలలు.. ఆపై వీడియోలు..!

|

మొగల్తూరు : మహిళల్ని నమ్మించాడు.. ట్రాప్ చేశాడు.. ఏకాంతంగా గడిపాడు. లైంగిక వాంఛలు తీర్చుకోవడమే గాకుండా వాటిని రికార్డ్ చేసి సెల్‌ఫోన్‌లో భద్రపరుచుకున్నాడు. ఇదంతా ఏ కాలేజీ స్టూడెంటో.. ఇంకెవరో చేసింది కాదు. ఓ సెల్‌ఫోన్ సెంటర్ నిర్వాహకుడు చేసిన నిర్వాకం. అయితే ఆ వీడియోలు బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కామాంధుడి బండారం బయటపడింది.

తీయగా మాట్లాడేవాడు.. నమ్మకం కుదిరేవరకు వారి జోలికి పోడు. అలా తరచుగా తన షాపుకు వచ్చే మహిళలతో చనువు పెంచుకున్నాడు. సందర్భం వచ్చినప్పుడు తనలోని కామాంధుడిని నిద్రలేపేవాడు. వారిని శారీరకంగా వాడుకుని వీడియోలు తీసేవాడు.

వాడు మామూలోడు కాదు.. స్కీమ్ పేరిట స్కామ్.. కోటి రూపాయలకు ఎసరు

సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు..!

సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు..!

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో స్థానికుల అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. మొబైల్ షాపు నిర్వాహకుడి రాసలీలలు బయటపడ్డాయి. మొబైల్ రీఛార్జీలు, సెల్‌ఫోన్ రిపేర్లు తదితర పనుల నిమిత్తం తన దుకాణానికి వచ్చే మహిళలను ఆ కామాంధుడు వంచించాడు. వారిని ట్రాప్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు.

నమ్మకం కలిగేంతవరకు వారి జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునే ఆ కామాంధుడు.. ఒకసారి వారు బుట్టలో పడ్డాక విశ్వరూపం చూపేవాడు. వారితో ఏకాంతంగా గడుపుతూ లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. అయితే ఆ తతంగమంతా వీడియోలు తీసి తన ఫోన్‌లో భద్రపరుచుకున్నాడు.

 మహిళలను ట్రాప్ చేసి.. శారీరకంగా లోబర్చుకుని..!

మహిళలను ట్రాప్ చేసి.. శారీరకంగా లోబర్చుకుని..!

మొగల్తూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో వెలుగుచూసిన ఘటన జిల్లాలో అలజడి రేపింది. లక్ష్మిసాయి సెల్ పాయింట్ పేరుతో మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ దుకాణం నిర్వాహకుడి కామపురాణం బయటపడింది. వివిధ పనుల నిమిత్తం అతని దగ్గరకు వచ్చే మహిళలు, యువతులకు మాయామాటలు చెప్పి ట్రాప్‌ చేసేవాడు. వారితో చనువు పెంచుకొని.. ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. అయితే అతని దగ్గర ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. సదరు యజమాని ఫోన్‌లోని అశ్లీల చిత్రాలను చూసి కంగుతిన్నాడు.

యజమాని అలా.. పనోడు ఇలా.. ఇద్దరు కలిసి..!

యజమాని అలా.. పనోడు ఇలా.. ఇద్దరు కలిసి..!

యజమాని ఫోన్‌లో ఆ వీడియోలు చూసిన యువకుడు క్రమక్రమంగా తన ఫోన్‌లోకి పంపించుకున్నాడు. అలా ఆ వీడియోలను తాను చూడటమే గాకుండా.. స్నేహితులకు పంపించాడు. అలా ఒకరి నుంచి మరొకరికి షేర్ అవుతూ సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారాయి. నెమ్మదిగా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఆ క్రమంలో స్థానికంగా ఆ వీడియోలు దుమారం రేపాయి.

తెలిసిన మహిళల మొఖాలు ఆ వీడియోల్లో కనిపించడంతో చాలామంది షాక్‌కు గురయ్యారు. చివరకు ఆ వీడియోలు బాధితుల ఫోన్లకు చేరడం మొదలైంది. అయితే చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. అందులో ఒక బాధితురాలు మాత్రం ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. దాంతో సదరు సెల్‌ఫోన్ పాయింట్ నిర్వాహకుడి బాగోతం వెలుగుచూసింది.

షాపు యజమానితో పాటు అందులో పనిచేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి ఫోన్లను సీజ్ చేశారు. అయితే అతడి చేతిలో చాలామంది మహిళలు బలయ్యారని తెలుస్తోంది. ఆ మేరకు నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mobile Shop Owner traped and had sex with women customers and taken videos. One young man joined in his shop for training and forwarded that videos for personal mobile. Then he shared videos for his friends, like that the videos goes viral in local. One of the victim complaint to police, shop owner and trainee guy arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more