హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జూ ఆర్టిస్ట్, ఇద్దరు మోడల్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Models, Jr Artist, rescued from racket
హైదరాబాద్: నగరంలో సోమవారం మరో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న బుల్లి తెర నటితో పాటు మోడల్స్‌ను పోలీసులు రక్షించారు. బంజారాహిల్స్ లక్ష్మీనరసింహనగర్‌లోని ఓ ఇంట్లో జరుగుతున్న వ్యవహారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.

పట్టుబడ్డ నటి జూనియర్ ఆర్టిస్ట్ కాగా, మోడల్స్ కోల్‌‍కతాకు, హైదరాబాదుకు చెందిన వారిగా తెలుస్తోంది. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని పూర్ణచంద్ర రావు, సురేష్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరు గత ఎనిమిది నెలలుగా వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

పూర్ణచంద్ర రావు మణికొండలో నివసిస్తున్నాడు. ఇతను వ్యభిచార గృహాన్ని తనకు తెలిసిన వారికి అమ్మాయిలను సరఫరా చేస్తూ నడిపిస్తున్నాడు. ఇతనికి సురేష్ సహకరిస్తున్నాడు.

పూర్ణచంద్ర రావు తనకు తెలిసిన కస్టమర్స్‌కు మోడల్స్ ఫోటోలను చూపించి వారిని సరఫరా చేసేవాడు. నిందితుల నుండి పోలీసులు ఐదు సెల్ ఫోన్స్, కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్ణచంద్ర రావు, సురేష్‌లను పోలీసులు స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పట్టుబడ్డ యువతులు 19 నుండి 26 ఏళ్ల మధ్య ఉన్నవారు. వీరిని పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు.

English summary
The Police busted a high profile sex racket at Banjara Hills on Monday night and rescued a Junior artiste, two models.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X