• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ కొంపముంచిన మోడీ- కీలక ప్రాజెక్టులకు కోలుకోలేని దెబ్బ- తెలంగాణ, ఒడిశా హ్యాపీ

|

త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, భవిష్యత్ సమీకరణాలు, మంత్రుల పనితీరును దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన చేపట్టారు. దీంతో 12 మంది మంత్రులు పదవులు కోల్పోయారు. చాలా మంది మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు జరిగాయి. వీటి ప్రభావం అనూహ్యంగా ఏ ఒక్క మంత్రి పదవినీ దక్కించుకోలేని ఆంధ్రప్రదేశ్ పై పడింది. దీంతో ఏపీ పరిస్ధితి మరింత దారుణంగా మారబోతోంది. ఏపీ కీలకంగా భావిస్తున్న రెండు ప్రాజెక్టులపై కేంద్ర కేబినెట్ పరోక్షంగా ప్రభావం చూపబోతోంది.

 జగన్ కు కేంద్ర కేబినెట్ ప్రక్షాళన షాక్

జగన్ కు కేంద్ర కేబినెట్ ప్రక్షాళన షాక్

నిన్న జరిగింది కేంద్రంలోని మోడీ కేబినెట్ ప్రక్షాళనే అయినా అది అంతిమంగా పలు రాష్ట్రాలకు మోదాన్నీ, మరికొన్ని రాష్ట్రాలకు ఖేదాన్నీ మిగిల్చింది. ఇలా మోడీ కేబినెట్ ప్రక్షాళనతో దారుణంగా దెబ్బతినే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి ముందువరుసలో నిలిచింది. జంబో కేబినెట్ లో కనీసం ఒక్క మంత్రి పదవినీ దక్కించుకోలేని ఏపీకి ఈ కేబినెట్ ప్రక్షాళన ఖేదాన్ని మిగల్చగా.. ఇప్పుడు పరోక్షంగా రెండు కీలక ప్రాజెక్టులకు ఈ మార్పులు శరాఘాతంగా మారబోతున్నాయి. దీంతో సీఎం జగన్ కష్టాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

 ఏపీపై ప్రభావం చూపే కేంద్ర కేబినెట్ మార్పులివే

ఏపీపై ప్రభావం చూపే కేంద్ర కేబినెట్ మార్పులివే

తాజాగా కేంద్రకేబినెట్ లో జరిగిన రెండు మార్పులు ఏపీపై పెను ప్రభావం చూపబోతున్నాయి. ఇందులో పర్యావరణ, రైల్వే మంత్రిత్వశాఖల్లో జరిగిన మార్పులు కీలకమైనవి. పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాష్ జవదేకర్ ను మోడీ కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా ఉద్వాసన పలికారు. ఆయన స్ధానంలో కొత్త పర్యావరణ మంత్రిగా రాజస్దాన్ బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ ను తీసుకున్నారు. అలాగే రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ను అక్కడి నుంచి తప్పించి వాణిజ్యమంత్రిత్వశాఖ కేటాయించారు. ఆయన స్ధానంలో కొత్త రైల్వే మంత్రిగా ఒడిశా బీజేపీ నేత అశ్వీనీ వైష్ణవ్ నియమితులయ్యారు. ఈ కొత్త మంత్రుల రాక ఏపీకి శరాఘాతంగా మారబోతోంది.

 రాయలసీమ లిఫ్ట్ కథ మళ్లీ మొదటికి

రాయలసీమ లిఫ్ట్ కథ మళ్లీ మొదటికి

ఏపీలో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం (రాయలసీమ లిఫ్ట్) కు ఇప్పటివరకూ పర్యావరణ అనుమతులు లభించలేదు. ఇందుకోసం కేంద్రం వద్ద సీఎం జగన్ చేయని లాబీయింగ్ లేదు. తాజాగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముందు కూడా అప్పటి పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ కు సీఎం జగన్ లేఖ రాశారు. రాయలసీమ లిఫ్ట్ కు త్వరగా పర్యావరణ అనుమతులు ఇప్పించాలని, తెలంగాణ కృష్ణానీరు అక్రమంగా వాడుకోవడం వల్ల తమకు దిగువ రాష్ట్రంగా సమస్యలు తప్పడం లేదని, అందుకే సీమ లిఫ్ట్ కు త్వరగా పర్యావరణ అనుమతులు ఇప్పించాలని కోరారు. ఇప్పుడు జవదేకర్ రాజీనామాతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తాజా పరిణామాలతో కొత్త పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ దగ్గర మళ్లీ జగన్ కొత్తగా లాబీయింగ్ ప్రారంభించాల్సిందే.

  Ys Jagan Anil Kumble Meet, కుంబెకి జగన్నన్న హామీ ! || Oneindia Telugu
   దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై దెబ్బ

  దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై దెబ్బ

  ఇదే కోవలో ఏపీకి విభజన హామీల్లో భాగంగా లభించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలోనూ కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తీవ్ర ప్రభావం చూపబోతోంంది. ఏపీతో సత్సంబంధాలున్న పీయూష్ గోయల్ ను ప్రధాని మోడీ రైల్వేమంత్రిగా తప్పించి వాణిజ్య శాఖ అప్పగించారు. దీంతో ఆయన స్ధానంలో రైల్వేమంత్రిగా ఒడిశాకు చెందిన అశ్వీనీ వైష్ణవ్ రాబోతున్నారు. మరోవైపు ఇప్పటికే ఒడిషాలోని రాయగడ డివిజన్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం రైల్వే బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. పీయూష్ గోయల్ హయాంలోనే దీని కోసం ప్రయత్నాలు జరిగాయి. రాయగడ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైతే ఏపీలోని వాల్తేర్ డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది. గోయల్ రైల్వేమంత్రిగా ఉంటే కనీసం ఏపీకి ఊరటనిచ్చేలా కనీసం ఏదో ఒక ప్రకటన వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు ఒడిశాకు చెందిన అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రి కావడంలో ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి.

  English summary
  recent reshuffle of modi's cabinet will show adverse impact on key projects in andhrapradesh like rayalaseema lift and south costal railway zone.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X