కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ,చంద్రబాబు,జగన్,పవన్...ఆ నలుగురూ దొంగలే; అందుకే ఈ నాటకాలు:రఘువీరారెడ్డి

|
Google Oneindia TeluguNews

కర్నూలు: పధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌...ఈ నలుగురూ దొంగలే నని ఎపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.

శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా దాడుల నాటకాలు ఆడుతున్నాయని...బీజేపీ, టీడీపీ నాలుగేళ్లు కలసి కాపురం చేశాయి. ఇప్పుడు విడాకులు తీసుకున్నాక ఐటీ దాడులు చేయడం వెనుక అంతర్యమేమిటో ప్రజలకు తెలుసన్నారు.

వాళ్లలా...వీళ్లిలా

వాళ్లలా...వీళ్లిలా

ఈ ఐటీ దాడులు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టిడిపి అంటుంటే.. దాడులు చేస్తే తప్పేంటని ప్రతిపక్ష నేత జగన్‌ అనడం చాలా విడ్డూరంగా ఉందని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. రూ.49 వేల కోట్ల రాఫెల్‌ కుంభకోణం జరిగితే జగన్‌, పవన్‌లు ఎందుకు ప్రశ్నించలేదు?...అని రఘువీరా నిలదీశారు. అగ్రిగోల్డ్ సంస్థ మాదిరిగానే దేశంలో మరో సంస్థ పెరల్స్‌ కూడా ఇలాగే ఐదున్నర కోట్ల మంది వద్ద రూ.49వేల కోట్లు దోచుకుందన్నారు.

కాంగ్రెస్ తోనే...సాధ్యం

కాంగ్రెస్ తోనే...సాధ్యం

రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం బాధాకరమని రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని చెప్పి...కేవలం తన కుమారుడికి మంత్రి ఉద్యోగం ఇప్పించారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్...హామీలు

కాంగ్రెస్...హామీలు

రాహుల్‌గాంధీ ప్రధాని అయిన వెంటనే ఎపికి ప్రత్యేక హోదా బిల్లుపై సంతకం చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లు వయస్సు ఉన్న వారికి రూ.2 వేలు, 60 నుంచి 70 ఏళ్ల వారికి రూ.2,500, 70ఏళ్లు పైబడిన వారికి రూ.3 వేల పింఛన్‌ అందిస్తామన్నారు. దేశంలోని ప్రతి రైతుకు రూ.2 లక్షలు, ప్రతి పొదుపు సంఘానికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏటా 4 వంట సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.

 టిడిపిపై...విమర్శలు

టిడిపిపై...విమర్శలు

టిడిపి ప్రభుత్వం ఏడాదికోసారి రేషన్‌ దుకాణాల ద్వారా వివిధ రకాల వస్తువులు అందిస్తుందని, కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన వెంటనే రేషన్‌కార్డుకు ప్రతి నెల 9 రకాల వస్తువులు అందిస్తామన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి కర్నూలు జిల్లాకు రైల్వే కోచ్‌ పరిశ్రమ మంజూరు చేస్తే వాటిని ఇప్పటికి పూర్తి చేయలేని పరిస్థితి టిడిపి ప్రభుత్వానిదని రఘువీరా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమను ఆదరించాలని కోరారు.

English summary
APCC President Raghuveera Reddy alleges that Narendra Modi, Chandrababu,Jaganmohan Reddy, Pawan Kalyan...these four are the thiefs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X