వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆనాడు తిరుపతి సభలో హోదా ఇస్తానని మోడీ చెప్పలేదు, బాబు నిందలు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ గోకరాజు రంగరాజు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి సభలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పలేదన్నారు. అసలు ప్యాకేజీకి అంగీకరించి, ఇప్పుడు చంద్రబాబు మాట మార్చారని మండిపడ్డారు.

బీజేపీకి షాక్: మోడీ తిరుపతి హామీకి సాక్షి కారుమంచి రాజీనామా, రేపు టీడీపీలోకిబీజేపీకి షాక్: మోడీ తిరుపతి హామీకి సాక్షి కారుమంచి రాజీనామా, రేపు టీడీపీలోకి

తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు బీజేపీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు ఆయనను గెలిపిస్తే మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలను ఒక్క దానిని నెరవేర్చలేదన్నారు.

Modi did not talks about Special Status in Tirupati meeting, says Gokaraju

మోడీకి ఎదురెళ్లి పోరాడుతున్నాం: అచ్చెన్నాయుడు

వెంకన్న సన్నిధిలో మోడీ ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకే రేపటి సభ అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. నాడు మోడీ ఏం చెప్పారో తెలియజేస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందన్నారు. ప్రతి నెలా ఒక జిల్లాకు వెళ్లి అక్కడి మేధావులతో చర్చించి సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

ప్రత్యేక హోదా కోసం మోడీకి ఎదురెళ్లి పోరాడుతున్నామని చెప్పారు. మోడీ వెనుకుండి జగన్‌ను నడిపిస్తున్నారన్నారు. బీజేపీ ఎలా ఆడమంటే జగన్ అలా ఆడుతున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటై వైసీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలన్నారు. విభజన హామీలపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే తమకు సహకరించాలన్నారు.

English summary
PM Narendra Modi did not talks about Special Status in Tirupati meeting, says MP Gokaraju Ranga Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X