• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబుకు అవమానం: కేసీఆర్‌కు మోదీ అనూహ్య గిఫ్ట్ - ఇక ఢిల్లీలో కారు చక్రం

|

పేరుకు జాతీయ పార్టీ.. దాదాపు నాలుగు దశాబ్దాల ఘనమైన రాజకీయ ప్రస్థానం.. దేశం మొత్తానికి ఆయన పేరు సుపరిచితం.. ప్రపంచ నేతలకు కూడా అభిమానపాత్రుడు.. ఢిల్లీలో తాను చక్రం తిప్పానని.. రాష్ట్రపతి, ప్రధాని అభ్యర్థుల్ని డిసైడ్ చేస్తానని స్వయంగా చెబుతారు.. తన కింద పని చేసిన జూనియర్లు ఇవాళ ముఖ్యమంత్రులయ్యారనీ గుర్తుచేస్తారు.. అంతటి టీడీపీ అధినేత చంద్రబాబుకు దక్కని అరుదైన అవకాశం, ఘనత ఆయన జూనియర్, ప్రస్తుత తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దక్కడం విశేషం.

గాలి మరలతో నీరు, ఆక్సిజన్ ఉత్పత్తి - ప్రధాని మోదీ ఐడియాపై దుమారం - రాహుల్ సెటైర్లు -బీజేపీ ఎదురుదాడి

తొలి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్..

తొలి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ప్రాంతీయ పార్టీల హవా మొదలై నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ కేరాఫ్ ఆఫీసు లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీల ఎంపీలకు కేటాయించే ఇళ్లలోనే ఇన్నాళ్లూ రీజనల్ పార్టీల ఆఫీసులు కొనసాగాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు మాత్రమే ఢిల్లీలో ఆఫీసులు ఉండగా, జాతీయ పార్టీ టీడీపీకిగానీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకిగానీ సొంత కార్యాలయం లేదు. ఈ క్రమంలో ఢిల్లీలో సొంతగా పార్టీ ఆఫీసు కట్టుకోనున్న తొలి పార్టీగా టీఆర్ఎస్ అవతరించనుంది. ఆమేరకు..

జగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబు

కేసీఆర్‌కు మోదీ గిఫ్ట్..

కేసీఆర్‌కు మోదీ గిఫ్ట్..

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ భవన నిర్మాణం కోసం న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తూ మోదీ సర్కార్ శుక్రవారం కేసీఆర్ కు తీపి కబురు పంపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ ల్యాండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దీన్ దయాల్.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. 2018లో ప్రారంభించిన ప్రయత్నాలు ఎట్టకేలకు విజయం సాధించడంతో కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

  Dubbaka Bypoll: MP Revanth Reddy Campaign దుబ్బాక కోసం కాదు తెలంగాణ కోసం ఓటెయ్యండి!! || Oneindia
  బాబుతో కేసీఆర్‌కు పోలిక..

  బాబుతో కేసీఆర్‌కు పోలిక..

  న్యూఢిల్లీ లో టీఆర్ఎస్ ఆఫీసుకు స్థలం కేటాయింపు ప్రక్రియ ముగిసినందున త్వరలోనే కార్యాలయానికి శంకుస్థాపన జరిపి, త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది. కాగా 2018లో కేసీఆర్ ఢిల్లీ ఆఫీసు ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచే చంద్రబాబుతో ఆయనను పోల్చుతూ విశ్లేషణలు వెలువడ్డాయి. జాతీయ పార్టీ టీడీపీకి కాకుండా, తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ కు కేంద్రం ఆఫీసు స్థలం కేటాయించడం సహజంగానే చంద్రబాబుకు అవమానం లాంటిదని విశ్లేషకులు అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాలు.. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటుతో మరింత వేగవంతం కానున్నాయి.

  English summary
  central government has allotted 1100 square meters of land in Vasant Vihar in New Delhi to the TRS party for the construction of the Telangana Rashtra Samithi office building. To this end, Dean Dayal, Deputy Land Development Officer, Ministry of Housing and Urban Affairs, wrote a letter to TRS party president and chief minister KCR on Friday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X