వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ యోగా దినోత్సవం: డెహ్రాడూన్‌లో ప్రధాని మోడీ, అమరావతిలో చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

అంతర్జాతీయ యోగా దినోత్సవం: డెహ్రాడూన్‌లో ప్రధాని మోడీ, అమరావతిలో చంద్రబాబు

డెహ్రాడూన్/అమరావతి: నేడు (21 జూన్) అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది శాంతి కోసం యోగా పేరుతో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు జరుగుతాయని ఆయుష్‌ శాఖ తెలిపింది.

150కి పైగా దేశాల్లోనూ భారత రాయబార కార్యాలయాలు స్థానికులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. డెహ్రాడూన్‌లో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ... యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయన్నారు.

Modi leads International Yoga Day, says it unifies the world

ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదిక్‌కు ముఖ్య కేంద్రం అన్నారు. యోగా.. కుటుంబం, సమాజంలో సద్భావన కలిగిస్తుందని చెప్పారు. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి చికాగో వరకు అన్ని దేశాల ప్రజలు యోగాలో నిమగ్నమయ్యారన్నారు.

నేడు ప్రతి దేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాయని, అతి తక్కువ సమయంలోనే యోగానే ప్రపంచవ్యాప్తం అయిందన్నారు. యోగాను భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా చేరినట్లే యోగా కూడా అంతటా చేరుతోందన్నారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని ప్రతి ఒక్కరూ దీన్ని ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయన యోగాసనాలు వేశారు.

English summary
From Dehradun to Dublin, Shanghai to Chicago, Jakarta to Johannesburg, Yoga has become a unifying force, Prime Minister Narendra Modi said. He was addressing a gathering at the Forest Research Institute in Dehradun, Uttarakhan on the occasion of International Yoga Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X