వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి చేతికి అస్త్రం:ప‌్ర‌ధానిగా మోదీకే అవ‌కాశం..ఏపి కోసం కేసీఆర్ ఆలోచన‌:జ‌గ‌న్ వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం

|
Google Oneindia TeluguNews

హోరా హోరీ ఎన్నిక‌ల వేళ టిడిపి చేతికి మ‌రో అస్త్రం చిక్కింది. వైసిపి అధినేత జ‌గ‌న్ ఇప్పటికే ప్ర‌ధాని మోదీ.. తెలం గాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో క‌లిసి ఉన్నార‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఆరోపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఓ ఇం గ్లీషు చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. మోదీ మ‌రో సారి ప్ర‌ధాని అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని వ్యాఖ్యానించారు. కెసీఆర్ ఏపి కోసం ఆలోచిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.

<strong>పుట్టా సుధాక‌ర్ పై ఐటి దాడులు : ప‌్రొద్దుటూరు నివాసం లో సోదాలు : మ‌రి కొంద‌రు టిడిపి నేత‌లే</strong>పుట్టా సుధాక‌ర్ పై ఐటి దాడులు : ప‌్రొద్దుటూరు నివాసం లో సోదాలు : మ‌రి కొంద‌రు టిడిపి నేత‌లే

మోదీ..కేసీఆర్ పై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

మోదీ..కేసీఆర్ పై జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న జ‌గ‌న్ జాతీయ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో ప్ర‌ధాని మోదీ..తెలంగాన ము ఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. మోదీ దృఢ చిత్తం ఉన్న నాయకుడని, మళ్లీ ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్‌ అమేథీలో ఓడిపోతారేమో, అందుకే దక్షిణాది నుంచి పోటీ అని జగన్ వ్యాఖ్యానించారు. ఏపీ కోసం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ మద్దతిస్తున్నారని, ఆ మద్దతు ఏపీకి అత్యవసరమని జగన్‌ చెప్పారు. జ‌గ‌న్ పై ఒక వైపు టిడిపి అధినేత చంద్ర బాబు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌న పై ఉన్న కేసుల కార‌ణంగా మోదీకి మ‌ద్ద‌తు గా నిలుస్తున్నార‌ని ఆరోపిస్తున్నా రు. ఇదే స‌మ‌యంలో ఏపికి అన్యాయం చేస్తున్న కేసీఆర్ కు ఊడిగిన చేస్తున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. ఇదే స‌మ యం లో జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ లో భాగంగా చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను టిడిపి ప్ర‌చారంలో వాడుకొనే అవ‌కాశం ఉంది.

ఎవ‌రి తోనూ పొత్తు లేదు..

ఎవ‌రి తోనూ పొత్తు లేదు..

ఇదే ఇంట‌ర్వ్య లో జ‌గ‌న్ తాము ఎవ‌రి తోనూ పొత్తు పెట్టుకోవ‌టం లేద‌నే విష‌యాన్ని మ‌రో సారి స్ప‌ష్టం చేసారు. ఇప్ప‌టి కే ఇదే విషయాన్ని ప‌లు మార్లు చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ తో పాటుగా విజ‌య‌మ్మ‌..ష‌ర్మిళ సైతం ఈ విష‌యాన్ని ప్ర‌చారం లో గట్టిగా చెబుతున్నారు. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం ఏపిలోని 25 మంది ఎంపీల‌తో పాటుగా తెలంగాణ లోని 17 మం ది ఎంపీలు క‌లిసి వ‌స్తే కేంద్రం పై పోరాడి ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నారు. తాము సింగిల్ గా నే పోటీ చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, టిడిపి అధినేత మాత్రం జ‌గ‌న్ పూర్తిగా మోదీ..కేసీఆర్ చెప్పు చేత‌ల్లో ఉన్నారంటూ ప్ర‌తీ స‌భ‌లోనూ ఆరోపిస్తున్నారు. దీని పై అటు బిజెపి..కేసీఆర్ మాత్రం ఎక్క‌డా స్పందించ‌లేదు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ తాజాగా త‌న ఇంట‌ర్వ్యూ లో ప్ర‌ధాని గా మ‌రోసారి మోదీకి అవ‌కాశం ఉంద‌ని..కేసీఆర్ ఏపి పై ఆలోచ‌న చేస్తున్నార‌ని చెప్పిన అంశాల‌ను టిడిపి ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లు..

ఇప్ప‌టికే ప్ర‌చారం మొద‌లు..

ఇంట‌ర్వ్యూ మొత్తాన్ని కాకుండా.. కేవ‌లం త‌మ‌కు కావాల్సిన విధంగా మాత్ర‌మే జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించి టిడిపి మ‌ద్ద‌తు మీడియా ప్ర‌సారం చేస్తోంద‌ని వైసిపి ఆరోపిస్తోంది. జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోనే కేసీఆర్ ఏపికి హోదాకు మ‌ద్ద‌తి స్తున్నార‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, ఎలాగైనా జ‌గ‌న్ ను ఇబ్బంది పెట్టా ల‌నే ల‌క్ష్యంతోనే ఇటువంటి ప్రచారం చేస్తున్నార‌నేది వైసిపి నేత‌ల వాద‌న‌. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను టిడిపి ఏ ర‌కంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తుందీ..జ‌గ‌న్ ఎలా కౌంట‌ర్ చేస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

English summary
YCP Chief Jagan says Modi have to become PM in coming elections. Jagan in national channel interview says KCR is in favour of AP. Now on these comments TDP trying to campaign Jagan as KCR and Modi ally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X