వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీకి పాలించే హ‌క్కు లేదు: ఖ‌బ‌డ్దార్‌..వివ‌క్ష చూపిస్తే ఆటలు సాగ‌వ్‌: బాబు హెచ్చ‌రిక‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Election 2019: Modi Has No Right To Continue As Prime Minister Says Chandra Babu Naidu | Oneindia

ఢిల్లీ లో దీక్ష ప్రారంభించిన ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు ప్ర‌ధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తాను దీక్ష చేయ‌టానికి ఎదురైన ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఒక ప్రాంతం..ఒక రాష్ట్రం పై వివ‌క్ష చూపించే మోదీకి పాలించే హ‌క్క లేద‌ని విమ‌ర్శించారు. ఇక మోదీ అట‌లు సాగ‌వ‌ని బాబు హెచ్చ‌రించారు.

హ‌క్కుల కోస‌మే దీక్ష‌
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపికి ఇచ్చిన హామీల కోసం అనేక సార్లు ప్ర‌ధానితో స‌హా కేంద్ర మంత్రుల‌ను అభ్య‌ర్దించా మ‌ని అయినా ఇచ్చిన మాట మీద నిల‌బ‌డ‌క‌పోవ‌టంతో ఆందోళ‌న‌కు దిగామ‌ని సీయం వివ‌రించారు. దీక్ష ప్రారంభం సంద‌ర్భంలో మాట్లాడిన చంద్రబాబు విభ‌జ‌న స‌మ‌యంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను గుర్తు చేసారు. బిజెపి నేత‌లే ఏపికి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేసి ఇప్పుడు విస్మ‌రించార‌ని ఆరోపించారు. గుంటూరు లో బిజెపి మీటింగ్ కు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ కేవ‌లం త‌న‌ను తిట్టడానికే వ‌చ్చిన‌ట్లుగా ఉంద‌న్నారు.

ఏపికి సంబంధించి ప్ర‌జ‌లు ఏం కరుకుం టున్నారో ఆ విష‌యాల పై మీద మాట్లాడ‌కుండా త‌న‌ను దూషించ‌టానికే స‌మ‌యం కేటాయించార‌ని ఆరోపించారు. ఏపికి మూడు ల‌క్ష‌ల కోట్లు ఇచ్చామ‌ని చెబుతున్నార‌ని ఏ విధంగా ఇచ్చారో వివ‌రించాల‌ని డిమాండ్ చేసారు. తాను అనేక సార్లు వేడుకొని గ‌తంత‌రం లేని ప‌రిస్థితుల్లో దీక్ష‌కు దిగాన‌ని బాబు వివ‌రించారు.

Modi no right to continue as PM : Babu Dharma Deekhsa start

ఖ‌బ‌డ్దార్...జాగ్ర‌త్త‌..

ఢిల్లీలో దీక్ష వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌ధాని మోదీని హెచ్చ‌రించారు. ఇదే ఆంధ్రభవన్ సాక్షిగా ఎన్నో ఉ ద్యమాలు ప్రారంభించామని.. అవన్నీ జయప్రదం అయ్యాయి అన్నారు. ఇవాళ్టి ధర్మపోరాట దీక్ష కూడా విజయ వంతమవుతుందన్నారు. తాము చేస్తున్న పోరాటం ఐదు కోట్ల ప్రజల మనోభవాలకు సంబంధించినదని.. ఖబర్దార్.. జాగ్రత్తగా ఉండండని మోదీ సర్కార్‌ని హెచ్చరించారు. హక్కుల కోసం పోరాడుతున్నామని... భిక్ష కోసం కాదన్నారు. వివక్ష చూపిస్తే.. ఆటలు సాగవని చెప్పడానికి.. గుర్తు చేయడానికే ఢిల్లీకి వచ్చామన్నారు. పాలకులు ధర్మాన్ని మర్చిపో యినప్పుడు.. గుర్తు చేయాల్సిన బాధ్యత జనంపై ఉంటుందన్నారు. గోద్రా ఘటన జరిగినప్పుడు .. ధర్మాన్ని పాటించా ల్సిన వ్యక్తులు పాటించలేదంటూ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. లెక్కలు చెప్పడానికి తాము సిద్ధమని.. తాము కట్టిన పన్నులు చెప్పడానికి మోదీ సర్కార్ సిద్ధమా అని నిల‌దీసారు. ప్ర‌ధాని మోదీ పాలించే హ‌క్కు కోల్పోయా ర‌ని ఫైర్ అయ్యారు.

English summary
AP CM Chandra Babu fire on PM Modi. Modi has no right to continue as Prime Minister. he totally neglecting AP on central govt promises. Babu started Deekhsa against Central Govt in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X