తిరుమలేశుని సన్నిధిలో మోడీ: ప్రధాని అయిన తర్వాత తొలిసారి (పిక్చర్స్)
తిరుపతి: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం తిరుమలేశుడ్ని దర్శించుకున్నారు. ప్రధాని అయిన తర్వాత తిరుమల శ్రీవారి చెంతకు ఆయన రావడం ఇదే తొలిసారి. శ్రీవేంకటేశ్వర స్వామికి ఆయన ప్రార్థనలు చేశారు. దేశం ప్రశాంతంగా, ఐక్యంగా ఉంటుందని ప్రధాని ఆశిస్తూ తిరులేశుడి ఆశీస్సులు కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన తిరుమలకు వచ్చారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఎం. వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, నిర్మలా సీతారామన్ ఉన్నారు.
వేద మంత్రాల మధ్య మోడీకి సంప్రదాయ పద్థతిలో తిరుమల అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి చెంత ప్రధాని అర గంట పాటు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆ విషయం చెప్పారు.

సిల్కు వస్త్రాలతో సత్కారం
తిరుమలేశునికి ప్రార్థనలు ముగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని సిల్కు వస్త్తాలతో గౌరవించారు.

లడ్డూ ప్రసాదం
ప్రధాని నరేంద్ర మోడీకి లడ్డూ ప్రసాదం, చిన్న సీసాలో పవిత్ర జలాలు, శ్రీవెంకటేశ్వర స్వామి చిత్రపటం అందజేశారు.

అర్చకుల ఆశీస్సులు..
గవర్నర్ నరసిహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోగా ప్రధాని నరేంద్ర మోడీకి అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ ఆశీస్సులు అందించారు.

తిరుమలేశుని పాదాల చెంత..
నరేంద్ర మోడీ క్లుప్తంగా ప్రసంగించారు. బాలాజీ పాదాల చెంత విజయదశమి రోజు, నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా తనకు గడిపే అవకాశం దక్కిందని అన్నారు.

నాకు గౌరవం...
శ్రీ తిరుమలేశుని ఆశీస్సులు దక్కడం తనకు ఎంతో గౌరవమని, దేశం ప్రశాంతంగా, ఐక్యంగా ఉంటుందని ఆశిస్తున్నానని ప్రధాని అన్నారు.

గతంలో ఇలా..
నరేంద్ర మోడీ బిజెపి ప్రధాని అభ్యర్థిగా నిరుుడ మే 1వ తేదీన తిరుమలేశుడ్ని సందర్శించుకున్నారు. ప్రధాని అయిన తర్వాత తిరుమలకు రావడం ఇదే తొలిసారి.

శ్లోక పఠనం..
సంస్కృత శ్లోకాన్ని పఠించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక జ్ఞానం వ్యక్తిగత అభివృద్ధికి చాలా అవసరమని అన్నారు.

పేదవాడి కళ్లలో సంతోషం..
పేదవాడి కళ్లలో సంతోషం చూడడమే తమ లక్ష్యమని, పేదరికాన్ని నిర్మూలించి దాన్ని సాధించడానికి శ్రీతిరుమలేశుడి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.












Click it and Unblock the Notifications