• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమరావతిని మోడీనే కాపాడాలి .. నిరసనదీక్షలో చంద్రబాబు.. రాజధాని రైతుల పోరాటానికి 200 రోజులు

|

రాజధాని అమరావతి కొనసాగాలని సాగుతున్న ఉద్యమం 200వ రోజుకు చేరుకుంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రచారానికి దూరమైంది. కానీ నేటికీ అమరావతి రైతులు ఏదో ఒక రూపంలో తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నేడు రాజధాని అమరావతి ఉద్యమం 200వ రోజుకు చేరుకున్న సందర్భంగా రాజధాని కోసం ప్రాణాలు కోల్పోయిన అమరావతి గ్రామ రైతులకు జెఎసి నాయకులు నివాళులర్పించారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి జెఏసి నేతలు దీక్షలు చేస్తున్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష

రాజధాని రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు చేపట్టిన దీక్షలో చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. రాజధాని విషయంలో మాట తప్పారని, అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలని జగన్ అన్నారని గుర్తు చేశారు.

 అమరావతిపై ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్

అమరావతిపై ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్

ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? ఎవరైనా ప్రజల మనోభావాలతో మూడుముక్కలాట ఆడతారా? అని చంద్రబాబు మండిపడ్డారు.రాజధానికి మద్దతు ఇస్తున్నానని చెప్పిన జగన్ కు ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నించారు. రాజధానిగా ఉన్న అమరావతిపై ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారని, ముంపునకు గురవుతుందని అనవసరపు ప్రచారం చేశారని మండిపడ్డారు.ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కావాలని బురద చల్లారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

 రాజధాని అమరావతిని మోడీ కాపాడాలని విజ్ఞప్తి

రాజధాని అమరావతిని మోడీ కాపాడాలని విజ్ఞప్తి

ముంపుకు గురి కాదని గ్రీన్ ట్రిబ్యునల్ స్వచ్ఛంగా చెప్పిన విషయాన్ని పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులు త్యాగం చేశారన్నారు.రాజధాని కోసం కలలు కని,రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో తపించారని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో రాజధాని పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అమరావతి దేశ ప్రాజెక్టు, సంపద సృష్టించే ప్రాజెక్ట్ అని పేర్కొన్న చంద్రబాబు దీనిని కాపాడాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉందని పునరుద్ఘాటించారు. ఒకసారి రాజధాని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదన్నారు.

కేంద్ర నిధులు రాజధానిలో ఉన్న కారణంగా ఆలోచించండి

కేంద్ర నిధులు రాజధానిలో ఉన్న కారణంగా ఆలోచించండి

కేంద్ర నిధులు రాజధానిలో ఉన్న కారణంగా అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు. మన మట్టి ,మన నీళ్లు, మన అమరావతి స్ఫూర్తి కావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు మార్మోగాలి అని పేర్కొన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇబ్బందులు వచ్చాయి అని పేర్కొన్న చంద్రబాబు రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని ప్రజల మనోభావాలను గౌరవించాలని పేర్కొన్నారు.

  Telangana People Angry On Electricity Bill Charges
  రాజధాని రైతుల పోరాటానికి ప్రతిపక్షపార్టీల మద్దతు

  రాజధాని రైతుల పోరాటానికి ప్రతిపక్షపార్టీల మద్దతు

  రాజధాని ప్రాంత రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ దీక్ష విరమించమని, టిడిపి రైతులు పోరాటానికి ఎప్పుడూ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు బిజెపి సంఘీభావం ప్రకటించింది. అమరావతి ప్రాంత రైతులు ఉద్దండరాయునిపాలెం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రాజధాని అమరావతి మీరే కాపాడాలంటూ ప్రధాని నరేంద్రమోడీని కోరారు. దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం నేత బాబూరావు, బీజేపీ నేత గోపాలకృష్ణ, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మద్దతు పలికారు.

  English summary
  Former chief minister Chandrababu Naidu had also staged a protest at the Telugu Desam Party office in Mangalgiri in support of capital farmers as their protest reached 200 days . Chandrababu Naidu fired on CM Jagan Mohan Reddy's three capitals decision .He mentioned that pm modi to save capital amaravati .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X