విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశ నిర్మాణంలో యువతే కీలకం... ఏపీ ప్రజలకు టీడీపీ కాంగ్రెస్‌లు సమాధానం చెప్పాలి: మోడీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Mera Booth Sabse Mazboot: Modi Gives Mantra To AP BJP Party Workers For 2019 Polls

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ ప్రధాని తాను ఏమి చెప్పదలుచుకున్నారో బూతుస్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు. ముందుగా
ఆంద్రప్రదేశ్ కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. కార్యకర్తలతో తను ఎప్పుడూ వీడియో కాన్ఫరెన్స్‌తో మాట్లాడుతానని చెప్పిన మోడీ... ఇప్పుడు ఏపీ కార్యకర్తలతో ముచ్చటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

మేరా బూత్ సబ్సే మజ్బూత్ నినాదంతో ముందుకెళ్లండి

మేరా బూత్ సబ్సే మజ్బూత్ నినాదంతో ముందుకెళ్లండి

2019లో దేశం ఎన్నికలకు వెళ్లనుందని చెప్పిన ప్రధాని కార్యకర్తలే పార్టీకి బలం అని అన్నారు. . కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదని మోడీ అభిప్రాయపడ్డారు. బూతు స్థాయిలో గెలవగలిగితే కేంద్రంలో ప్రభుత్వం మనదే అవుతుందని మోడీ అన్నారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీకి 23 సూత్రాలున్నాయని చెప్పిన ప్రధాని ఆ సూత్రాలను అమలు చేస్తే విజయం కమలం పార్టీదే అవుతుందని అన్నారు. ఉదాహరణకు బీజేపీ జెండా ప్రతి గ్రామంలో ఎగురవేస్తే ప్రజలకు మనగురించి తెలుస్తుందన్నారు. నరేంద్ర మోడీ యాప్‌ ద్వారా పార్టీకి విరాళం ఇవ్వాలని ఇతరులను కూడా విరాళం ఇచ్చేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ.

 వ్యతిరేక ప్రచారాన్ని యువత నమ్మొద్దు

వ్యతిరేక ప్రచారాన్ని యువత నమ్మొద్దు

ముందుగా కాకినాడ బూతుస్థాయి కార్యకర్తలతో ప్రధాని మోడీ మాట్లాడారు. జీతీయ ప్రాధాన్యం ఉన్న 10 విద్యాసంస్థలను ఏపీలో ఏర్పాటు చేశామని మోడీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తామని చెప్పిన ప్రధాని మోడీ... యువత వ్యతిరేక ప్రచారాన్ని నమ్మొదంటూ పిలుపునిచ్చారు. ఏపీలో పాలకులు ఏదైనా చేసి ఉంటే ప్రజలు మాట్లాడేవారని మోడీ అన్నారు. కానీ ఎక్కడా అలా జరగలేదని చెప్పారు. ప్రజాస్వామ్యం ఒక పండగలాంటిది. దేశాన్ని నిర్మించాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. తొలిసారి ఓటు వేసేందుకు సిద్ధమవుతున్న యువత ప్రజాస్వామ్యం పండగలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత నెగిటివిటీని నమ్మదని చెప్పారు.

యువతకు బీజేపీ అభివృద్ధి గురించి చెప్పాలి

యువతకు బీజేపీ అభివృద్ధి గురించి చెప్పాలి

ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై యువతతో చర్చించాలని ప్రధాని మోడీ కోరారు. దేశం కోసం కన్న కలలను బీజేపీ ప్రభుత్వం ఎలా అయితే సాకారం చేసేందుకు కృషి చేసిందో వాటిపై బహిరంగంగా చర్చించాలని కార్యకర్తలకు సూచించారు ప్రధాని మోడీ. చర్చల ద్వారా ఎన్నో విషయాలను యువతతో పంచుకోవచ్చని చెప్పారు. నరేంద్ర మోడీ యాప్ గురించి వారికి చెప్పాలి. నమో యాప్‌లో తెలుగులో కూడా వార్తలు వస్తున్నాయని చెప్పారు. దేశంలోని పలు వార్తా ఛానెళ్లు ప్రముఖ వార్తలను మిస్ అవుతున్నాయని కానీ నమో యాప్‌లో అన్నిఉంటాయని చెప్పారు. దేశం అభివృద్ధిలో తీసుకెళ్లేందుకు ఎవరు కృషిచేస్తున్నారని యువతను అడగాలని చెప్పారు. అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దాలని ఎవరి కృషి చేస్తున్నారో చెప్పాలని యువతను అడగాల్సిందిగా మోడీ కార్యకర్తలకు సూచించారు.

 దేశ భద్రతే కాదు.. ప్రజలకు ఆర్థిక భద్రత కూడా ముఖ్యమే

దేశ భద్రతే కాదు.. ప్రజలకు ఆర్థిక భద్రత కూడా ముఖ్యమే

కార్యకర్తలు భద్రతపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ప్రధాని మోడీ. భద్రత అంటే కేవలం జాతీయ భద్రత కాదని ప్రతి మనిషికి భద్రత ఉండాలని చెప్పారు. దేశ ప్రజలకు ఆర్థిక భద్రత కూడా కల్పించామని చెప్పారు. ఇప్పటి వరకు 33 కోట్ల బ్యాంకు ఖాతాలు పేదవారికోసం సృష్టించామని చెప్పారు. సుకన్య సమృద్ది యోజన పథకం కింద ఇప్పటి వరకు 1.5 కోట్లు ఖాతాలు తెరవబడ్డాయని .... ఇది ఆడపిల్లల భద్రతకోసం అని చెప్పారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద నెలకు 1 రూపాయి కడితే ఆరోగ్య భద్రత కలుగుతుందని చెప్పారు. ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి బాటపడుతుందని చెప్పిన ప్రధాని ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొచ్చామని చెప్పారు.

ఇండియా ఫస్ట్ మంత్రమే భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలిపింది

ఏపీలో విదేశీ పాలసీల గురించి మాట్లాడటం శుభసూచకం అన్నారు ప్రధాని మోడీ. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ప్రజలు ఉన్నారని చెప్పారు. దేశ ప్రజల కారణంగానే నేడు భారత్ గురించి ప్రపంచ స్థాయి దేశాలు మాట్లాడుకుంటున్నాయని చెప్పారు. ఇండియా ఫస్ట్ మంత్రంతోనే ప్రపంచ దేశాల నోళ్లలో భారత్ పేరు నానుతోందని చెప్పారు. దీనికంతటికీ కారణం దేశ ప్రజలు బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపించడం వల్లే జరిగిందని మోడీ చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi spoke to the party workers of AP through video conference. He asked the party workers to work hard for the coming elections. He urged the karyakarthas to speak to the youth on the BJP development programmes. He also said that he will not stop working for the development of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X