వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు విశాఖ‌లో మోదీ స‌భ : నిరసనలకు టీడీపీ, జేఏసీ సమాయత్తం...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Prime Minister Narendra Modi To Visit Visakhapatnam | Oneindia Telugu

దేశ స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న వేళ‌..ప్ర‌ధాని మోదీ ఏపి వాణిజ్య రాజ‌ధాని విశాఖ‌కు వ‌స్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయ‌న విశాఖ‌లో జ‌రిగే ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో పాల్గొంటారు. అయితే, ప్ర‌ధాని స‌భ‌ను అధికార టిడిపి తో స‌హా..ప్ర‌జా సంఘాలు నిర‌సిస్తున్నాయి. మోదీ రాకనున నిర‌సిస్తూ ఆందోళ‌న‌ల‌కు స‌మాయ‌త్తం అవుతున్నారు.

విశాఖకు ప్ర‌ధాని మోదీ..

విశాఖకు ప్ర‌ధాని మోదీ..

ఇర‌వై రోజుల స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ మ‌రో సారి ఏపికి వ‌స్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 10న గుంటూరు స‌భ‌లో పాల్గొన్న మోదీ మ‌రో సారి ఏపి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈ రోజు విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. విశాఖ రైల్వే మైదానంలో సాయంత్రం నిర్వహించనున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజా చైతన్య సభ లో పాల్గొంటారు. ఈ స‌భ కోసం భారీబందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తదితర ప్రత్యేక దళాలను కూడా రంగంలోకి దింపారు. బందోబస్తులో పాల్గొనే వారి సంఖ్యను 2,460కి పెంచారు. సభకు 50వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

కొత్త వరాలు ఉంటాయా..

కొత్త వరాలు ఉంటాయా..

గుంటూరులో మొదటి ప్రజా చైతన్య సభలో మోదీ ఎలాంటి వరాలు కురిపించలేదు.ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భాజపా శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. ఈ దఫా ప్రధాని రాకకు ముందే ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుగా మారిన రైల్వేజోన్‌ను ప్రక టించడంతో భాజపా శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను తొలగిం చి దాని స్థానంలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను మంజూరు చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువె త్తుతున్నాయి. సాక్షాత్తూ రైల్వే ఉద్యోగులతో సహా పలు సంఘాలవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఈ సారి కూడా ప్ర‌ధాని రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అవుతారా..లేక ఏపి స‌మస్య‌ల మీద స్పందిస్తారా చూడాలి.

షెడ్యూల్ ఇలా..

షెడ్యూల్ ఇలా..

ప్రధాని మోదీ సాయంత్రం 6.20 గంటలకు వైమానిక దళ ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ వాయుస్థావరం ఐ.ఎన్‌.ఎస్‌.డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వే మైదానానికి గం.6.45కి వస్తారు. 6.55 గంటలకు మోదీ ప్రసం గం ప్రారంభం అవుతుంది. 45 నిమిషాలపాటు.. అంటే రాత్రి 7.40 గంటల వరకు ప్రధాని ప్రసంగం కొనసాగుతుంది. తిరిగి 7.55 గంటలకు వేదిక నుంచి బయలుదేరుతారు. అయితే, అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌ల్ల రిబ్బ‌న్ లు క‌ట్టుకొని నిర‌స‌న వ్య‌క్తం చేయ‌టానికి సిద్దం అవుతున్నారు.

English summary
Prime Minisgter Modi participatin party Rally in Visakha to day. TDP and Associations called for protest Modi tour in AP. ప్ర‌ధాని మోదీ ఈ రోజు విశాఖ లో స‌భ‌లో పాల్గొన‌నున్నారు. ప్ర‌ధాని రాక‌ను అధికార టిడిపి తో స‌హా ప్ర‌జా సంఘాలు నిర సిస్తున్నాయి. ప్ర‌ధాని కి వ్య‌తిరేకంఆ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X