• search
  • Live TV
కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నువ్వు ఒకటంటే..నేను రెండంటా: మోడీ-బాబు మధ్య ట్వీట్ల యుద్ధం: మధ్యలో జగన్ నూ లాగారు

|

కర్నూలు: తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా.. అనేది పాత సామెత. దాన్ని నిజం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకుల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది.. ట్వీట్టర్ మాధ్యమంగా. అచ్చంగా ఆ పాత సామెత ప్రాథమిక సూత్రాన్ని ఏ మాత్రం మీరకుండా వాదులాడుకుంటున్నారా ఇద్దరు. తాను కర్నూలుకు వస్తున్నానని నరేంద్ర మోడీ ట్వీటగా.. ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ చంద్రబాబు తన బాగా అలవాటైన డైలాగ్ ను వదిలారు. మహోన్నతమైన ఎన్టీఆర్ ఆశయాల సాధనకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నీళ్లొదిలారంటూ ప్రధాని విమర్శించగా.. విభజన హామీల సంగతేమైందంటూ చంద్రబాబు ఎదురుదాడికి దిగుతున్నారు. ఏడుకొండల వాడి సాక్షిగా ప్రత్యేక హోదా డిమాండ్, హామీలను నీరుగార్చడం.. ఇవన్నీ మనకు తెలిసిన, చంద్రబాబు తరచూ వాడే పదాలే. ఈ పడిగట్టు పదాలన్నీ ఇద్దరు నాయకుల ట్వీట్ల ద్వారా అవలీలాగా తన్నుకొచ్చేస్తున్నాయి.

ప్రధాని అభ్యర్థి ఎవరో.. డిసైడ్ చేసిన ఒవైసీ: ఆయనకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయట

తెలుగులో ట్వీటిన నరేంద్ర మోడీ..

నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. ప్రతి చిన్న విషయాన్నీ ఆయన ట్వీట్ చేస్తుంటారు. ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తుంటారు. సాధారణంగా అవన్నీ హిందీ, ఇంగ్లీష్ లల్లో ఉంటాయి. ఈ సారి కాస్త భిన్నంగా మోడీ.. తెలుగులో ట్వీటేశారు. అచ్చ తెలుగులో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వాటిని చూసి, చిర్రెత్తుకు రావడంతో చంద్రబాబు కూడా గేర్ మార్చారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకవచనంతో విరుచుకు పడ్డారు.

ఎన్టీఆర్ ఆశయాల సాధనకు తూట్లు పొడవలేదా?

మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు తెలుగుదేశం పార్టీ నీళ్లొదిలిందని మోడీ విమర్శించారు. ఏపీలో మోసపూరిత తెలుగుదేశం పార్టీ పాలన కొనసాగిస్తోందని అన్నారు. టీడీపీ పాలనలో ఏపీ పూర్తిగా అవినీతమయమైందని విమర్శించారు. అత్యంత బలహీనమైన పరిపాలనను చంద్రబాబు అందిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏపీ అన్ని రంగాల్లోనూ తిరోగమించిందని ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం తాను కర్నూలులో ఓ ర్యాలీలో పాల్గొనబోతున్నానని మోడీ తెలిపారు. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తానని, దేశ ప్రజలంతా మరోసారి ఎన్డీఏ మిత్ర పక్షాలను ఎందుకు ఎన్నుకోవాలో, ఎందుకు ఆశీర్వదించాలో వివరించదలచుకున్నానని అన్నారు. యువత కలలు నెరవేర్చటానికి తాను ఏపీ ప్రజల ఆశీస్సులను కోరుకుంటున్నానని తెలుగులో ట్వీట్ చేశారు. కర్నూలులో బహిరంగ సభ ముగించుకున్న అనంతరం మోడీ.. తెలంగాణలోని మహబూబ్ నగర్ వెళ్తానని, అక్కడ ఓ బహిరంగ సభలో పాల్గొంటానని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టలేదా?

ఈ ట్వీట్లను చూసిన వెంటనే.. చంద్రబాబు కూడా తన ఖాతాకు పని చెప్పారు. మోడీ చేసిన విమర్శలకు ఓ రెండు ఎక్కువ ట్వీట్లే చేశారు. విమర్శల ఘాటు కూడా పెంచారు. రైతులను, యువకులను, మైనార్టీలను, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాయం చేయటానికి నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా మేల్కొవాలని, మన ధర్మ పోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే ఆ సమయం ఆసన్నమైందని అన్నారు.

జగన్ ను అరెస్ట్ చేస్తామన్నారే?

ఆ యుద్ధం మధ్యలో జగన్ నూ లాగారు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనీ ఆరోపించారు. తనతోనే రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందన్న నరేంద్ర మోడీకి మాట నిలబెట్టుకోవడం చేతకాలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసి, ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై, రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టుపట్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. విభజన గాయాలతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చి, నిలబెట్టుకోలేదని అన్నారు. లక్ష కోట్లు దోచుకున్న స్కామ్ ఆంధ్ర ఆర్థిక నేరస్తులను కటకటాల వెనుక ఉంచుతానని హామీ ఇచ్చిన మోడీ.. దాన్నీ విస్మరించారని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A heat political conversation between Prime Minister of Indian Narendra Modi and Chief Minister of Andhra Pradesh Chandrababu Naidu on Friday. Based on Social Media Platform Modi and Babu tweets each other as strong comments their governance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more