వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరికీ న్యాయం జరుగుతోందా: 'చంద్రన్న'పై మోదుగుల సంచలనం

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సోమవారం నాడు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కేబినెట్ విస్తరణ జరిగినప్పటి నుంచి పలువురు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సోమవారం నాడు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కేబినెట్ విస్తరణ జరిగినప్పటి నుంచి పలువురు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

కేబినెట్ విస్తరణ పైనే కాకుండా తమకు ఉన్న అసంతృప్తిని నేతలు ఇప్పుడు బయట పెడుతున్నారు. ఈ రోజు గుంటూరులో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే మోదుగుల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసంతృప్తితో ప్రసంగం చేశారు. చంద్రన్న బీమా పథకంతో అందరికీ న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. కార్మికులు కాని వారే ఎక్కువగా బీమా పథకాన్ని వాడుకుంటున్నారన్నారు.

పవన్ కళ్యాణ్, జగన్‌లపై సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుపవన్ కళ్యాణ్, జగన్‌లపై సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

అయితే మోదుగుల అసంతృప్తి పార్టీ పైన కాకుండా అధికారుల పైన ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే తమ పాలనలో... చంద్రబాబు పేరు మీద పెట్టిన పథకం పైనే ఆయన అసంతృప్తి వెళ్లగక్కడం గమనార్హం.

గుంటూరు హోటళ్లలో బాలకార్మికులు పని చేస్తుంటే పట్టించుకునే వారే లేరన్నారు. మిరప తొడిమలు తీసే 25 వేల మందికి కార్మిక చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు.

బజరంగ్ జూట్ మిల్ లాకౌట్‌తో 1500 మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జూట్ మిల్ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మోదుగుల మండిపడ్డారు.

English summary
Telugudesam Party MLA Modugula Venugopal Reddy unhappy with Chandranna Beema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X