వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై వార్: చిత్తూరు జిల్లాలో 8 గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్న మోహ‌న్‌బాబు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. కరోనా మహమ్మారి భారతదేశంపైనా తన ప్రభావం చూపిస్తుంది .కరోనాపై ఇండియా సాగిస్తున్న పోరాటంలో ఇప్పటికే సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు మేము సైతం అంటున్నారు.ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నారు . ప్రజలను కరోనా నుండి కాపాడుకోవటానికి ఇళ్లకే పరిమితం అవ్వాలని హితవు చెప్తున్నారు . అయితే సామాన్యప్రజలు మాత్రం నిత్యం పనులు లేక, సంపాదనా మార్గాలు కనపడక , తినటానికే తిండి లేని పరిస్థితులలో విలవిలలాడుతున్నారు. వారి కోసం చాలా మంది ప్రముఖులు రంగంలోకి దిగారు. అందులో మంచు వారి కుటుంబం కూడా ఒకటి.

Recommended Video

Mohan Babu Adopts 8 Villages In Chittoor District
వ్హిట్టురు జిల్లాలో 8 గ్రామాలను దత్తత తీసుకున్న మోహన్ బాబు

వ్హిట్టురు జిల్లాలో 8 గ్రామాలను దత్తత తీసుకున్న మోహన్ బాబు

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోన్న సమయంలో ప్రభుత్వాలకు చాలా మంది బాసటగా నిలుస్తున్నారు. అన్ని రంగాల‌కి చెందిన ఎంతోమంది నిరుపేద ప్ర‌జ‌లు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న వేళ సినీ నటుడు , రాజకీయ నాయకుడు మోహ‌న్ బాబు కుటుంబం పేద‌వారి ఆక‌లిబాధ‌ తీర్చేందుకు రంగంలోకి దిగింది. చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్న వారు నిత్యం నిరుపేదలకు కావలసిన భోజన వసతి కల్పిస్తున్నారు.

ఆహారం, నిత్యావసరాలు, మెడికల్ అవసరాలను తీరుస్తున్న మంచు ఫ్యామిలీ

ఆహారం, నిత్యావసరాలు, మెడికల్ అవసరాలను తీరుస్తున్న మంచు ఫ్యామిలీ

ఏర్పేడు మండలం మోదుగులపాలెం మోహన్ బాబు జన్మించినగ్రామం కాగా తమ ప్రాంతం విద్యా రంగంలోనూ అభివృద్ధి చెందాలని ఆయన రంగపేట సమీపంలో ‘శ్రీ విద్యానికేతన్‌' పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. ఆప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం ఏదో ఒకటి ఎప్పటికే చేస్తూనే ఉండే మంచు కుటుంబం ఇప్పుడు తమ ప్రాంతంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని వారందరికీ భోజనం అందించి తమ మంచి మనసును చాటుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్న మోహ‌న్‌బాబు కుటుంబీకులు వారికి కావాల్సిన నిత్యావసరాలు, ఆహరం మాత్రమే కాకుండా మాస్కులు , శానిటైజర్ లను పంపిణీ చేస్తున్నారు .

మంచు విష్ణుతో కలిసి గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని అందిస్తున్న మోహన్ బాబు

మంచు విష్ణుతో కలిసి గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని అందిస్తున్న మోహన్ బాబు

మోహ‌న్‌బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రోజుకు రెండు పూటలా ఆహారం పంపిణీ చెయ్యటం మాత్రమే కాకుండా లాక్‌డౌన్ ముగిసే వరకు వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతి నిత్యం ఇలా ఆహారాన్ని దత్తత తీసుకున్న గ్రామాల ప్రజలకు పంపిణీ చేయనున్నారు. అంతే కాకుండా ఎనిమిది టన్నుల కూరగాయలను ఈ గ్రామాల్లోని పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

ఏపీలో నిరుపేదలకు భోజనం పెడుతూ మంచు మనోజ్ టీం సేవలు

ఏపీలో నిరుపేదలకు భోజనం పెడుతూ మంచు మనోజ్ టీం సేవలు

సొంత జిల్లా ప్ర‌జ‌ల కోసం మోహ‌న్ బాబు మాస్కులు, శానిటైజర్లను కూడా అందిస్తున్నారు. ఇక మంచు మనోజ్ సైతం సామాజిక బాధ్యతలో నేను సైతం అంటూ త‌న టీం స‌భ్యుల‌ని తెలుగు రాష్ట్రాల‌కి పంపి పేద వారికి ఆహారం, నీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఈ విపత్కర సమయాల్లో మోహన్ బాబు ఫ్యామిలీ చేస్తున్న సేవను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ తరహా చొరవ ప్రముఖులు తీసుకుంటే చాలా మంది ఆకలి బాధ తీరుతుందని అంటున్నారు.

English summary
The Mohanbabu family, who have adopted 8 villages in the Chandragiri constituency of Chittoor district, are supplying not only food, but also masks,sanitizers and daily essentials .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X