వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ను ప్రస్తావించి..: మోహన్ బాబు షాకింగ్ వ్యాఖ్యలు ఎవరి పైన?

ప్రముఖ సినీ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యులు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. డబ్బున్న వారికే తిరుమలలో శ్రీవారి దర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ప్రముఖ సినీ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యులు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. డబ్బున్న వారికే తిరుమలలో శ్రీవారి దర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు.

అదే సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో ఉన్నంతగా ఇప్పుడు ఇక్కడ పరిపాలన సాగడం లేదన్నారు. దీంతో, మోహన్ బాబు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

డబ్బున్న వారికేనా, చిట్టా అంతా నా వద్ద ఉంది కానీ: మోహన్ బాబు సంచలనం

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం నాడు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ హయాంలో ఉన్నంతగా ఇప్పుడు పాలన సాగడం లేదని వ్యాఖ్యానించారు.

Mohan Babu breathed fire on AP Govt & TTD.

గుడిలో ఒక్కొక్కసారి ఒక్కో నిబంధన పెడుతున్నారని, అధికారి మారినప్పుడల్లా వారికి ఇష్టం వచ్చినట్లు మార్పులు తెస్తారని, భక్తులకు మేలు చేసేది అయితే పర్వాలేదని, మైలు అయితే ఉండదన్నారు. ఈ రోజు తాను చాలా బాధపడ్డానని అన్నారు. అంతేకాదు, ఇందుకు కారణం ఎవరో తాను చెప్పదలుచుకోలేదన్నారు.

అయితే, ఇప్పుడు ఏపీలో టిడిపి ప్రభుత్వం ఉంది. అలాగే, టిటిడి బోర్డు కూడా ఈ ప్రభుత్వం నియమించిందే ఉంది. ఇలాంటి సమయంలో ఆయన ఎన్టీఆర్ హయాంలో ఉన్నంతగా పరిపాలన సాగడం లేదని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది.

పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!

మోహన్ బాబుకు చంద్రబాబుకు చాలా కాలంగా రాజకీయంగా దూరం ఉన్నదనే అభిప్రాయం ఉన్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం చంద్రబాబును తిరుపతిలోని తమ స్కూల్లోని కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు. అప్పుడు దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ దూరం పెరిగినట్లుగా వాదనలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, కూతురు మంచు లక్ష్మి చంద్రబాబు పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిత్యం వ్యాయామం చేయడం వల్లనే ఆయన హ్యాండ్సంగా, స్ట్రాంగ్‌గా ఉన్నారని విజయవాడలో జరిగిన మారథాన్ కార్యక్రమంలో అన్నారు.

English summary
Mohan Babu breathed fire on AP Govt & TTD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X