• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్టీఆర్ "శాపం" ఈ ఎన్నికల్లో ఫలించబోతోంది ! జోస్యం చెప్పిన మోహన్ బాబు .

|
  AP Assembly Elections 2019 : ఎన్టీఆర్ 'శాపం'ఫలించబోతోంది జోస్యం చెప్పిన మోహన్ బాబు || Oneindia

  ఏపీలో ఎన్నికల ప్రచారంలో మోహన్ బాబు దూసుకుపోతున్నారు. వై సీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న మొహనబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీ రామారావు చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు అంటూ అలాంటి చంద్రబాబుని ఓడించండి అంటూ మోహన్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు .

  చంద్రబాబు కోసం మరో స్టార్ క్యాంపెయినర్.. ఏపీలో నటి రేవతి ఎన్నికల ప్రచారం

  మామను వెన్నుపోటు పొడిచిన బాబు ... ఎన్టీఆర్ శాపంతో టీడీపీ భూస్థాపితం అన్న మోహన్ బాబు

  మామను వెన్నుపోటు పొడిచిన బాబు ... ఎన్టీఆర్ శాపంతో టీడీపీ భూస్థాపితం అన్న మోహన్ బాబు

  పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోహన్ బాబు వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఇక ఎక్కడ రోడ్ షో చేసినా ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని టీడీపీ ని లాక్కున్నారని మోహన్ బాబు చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు .రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయమని అన్న ఎన్టీఆర్ ను మోసం చేసిన శాపం ఫలిస్తుందన్నారు మోహన్ బాబు .

  పోలవరం నిధుల లెక్కలు చెప్పని బాబు .. పోలవరం చంద్రబాబు అబ్బ మొగుడి సొమ్మా అంటూ తీవ్ర వ్యాఖ్యలు

  పోలవరం నిధుల లెక్కలు చెప్పని బాబు .. పోలవరం చంద్రబాబు అబ్బ మొగుడి సొమ్మా అంటూ తీవ్ర వ్యాఖ్యలు

  చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు . పోలవరం నిధుల గురించి కేంద్రం లెక్కలు అడిగితే చెప్పటం లేదని అదేమైనా బాబు తన అబ్బ మొగుడి సొమ్ము అనుకొంటున్నాడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు . చంద్రబాబు లాంటి వ్యక్తిని వేరే దేశంలో అయితే ఉరి తీసేవారన్నారు. కనీసం సరిగ్గా మాట్లాడటం కూడా రాని తన కొడుక్కి మూడు మంత్రి పదవులు కట్టబెట్టటం సమంజసమా అని చంద్రబాబును ప్రశ్నించిన మోహన్ బాబు ఇక ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్తారని అన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు ఇసుక, మట్టి దోచుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఈసారి మళ్లీ అధికారం ఇస్తే ప్రజల రక్తాన్నే పీల్చేస్తారని విమర్శించారు.

  రాష్ట్రంలో వైసీపీ గాలి .. వైసీపీకి 130 స్థానాల్లో విజయం పక్కా అంటున్న మోహన్ బాబు

  రాష్ట్రంలో వైసీపీ గాలి .. వైసీపీకి 130 స్థానాల్లో విజయం పక్కా అంటున్న మోహన్ బాబు

  రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని మోహన్ బాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 130 స్థానాల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. వైఎస్‌ జగన్‌ కేసులు గురించి మాట్లాడే బాబు తనపై ఉన్న 11 కేసుల గురించి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారని చంద్రబాబును ఎద్దేవా చేశారు . ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని నాలుకలతో మాట్లాడుతున్నాడో ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు టార్గెట్ గా మోహన్ బాబు మాటలతూటాలు పేలుస్తూ చంద్రబాబు, లోకేష్ లపై నిప్పులు చెరుగుతున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mohan Babu, who recently joined the YCP, is campaigning in AP. Mohan Babu, who participated in election campaign in Tanuku in West godavari district, was fired on chandrababu . chandrababu cheated NTR , now people of Andhra will teach a lesson to Chandrababu in this elections Mohan babu said , and he made some sensational comments on Polavaram project .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more