వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కోసం జగన్ గట్టి ప్రయత్నం...ఎందుకంటే?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

నెల్లూరు:డైలాగ్ కింగ్ మోహన్ బాబుని రాజకీయాల్లోకి రీ ఎంట్రీ...వైసిపిలోకి ఎంట్రీ ఇప్పించాలని ఆ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోందని విశ్వసనీయ సమాచారం. గతంలో టిడిపి తరుపున రాజ్యసభ ఎంపీగా పాలిటిక్స్ టేస్ట్ చూసిన మోహన్ బాబు ఆ తరువాత ఎందుకో ఆ పార్టీకి...తదనంతరం రాజకీయాలకు దూరమయ్యారు.

అయితే మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురావాలని, తమ పార్టీకి కొదువగా ఉన్న కమ్మ సామాజిక అండదండలను మరింత పెంచుకోవాలని వైసిపి పట్టుదలతో ఉందట. ఆయన్ని నెల్లూరు లోని వెంకటగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దించితే పార్టీకి ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతో వైఎస్ఆర్సిపి ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఆ నియోజకవర్గం కాకున్నా మోహన్ బాబుకు కొన్ని ఆప్షన్లు ఇచ్చి ఆయనకు వాటిలో ఆయనకు నచ్చిన స్థానం నుంచైనా ఆయన్ను బరిలోకి దింపాలని వైసిపి అధినేత జగన్ ప్రస్తుతం వ్యూహం గా చెబుతున్నారు.

వాళ్లు కావాలి...ఇంకా రావాలి

వాళ్లు కావాలి...ఇంకా రావాలి

వైసిపిలోకి వీలైనంతమంది కమ్మ సామాజిక వర్గం నేతలను ఆకర్షించాలని వైసిపి అధినేత జగన్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడగలిగే వాళ్లయితే ఇంకా మంచిదని జగన్ భావిస్తున్నారట. కారణం...రాజకీయంగా సామాజిక వర్గాల ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గంపై విమర్శలు చేయాలంటే అదే సామాజిక వర్గం నేతలతో చేయించడమే బెటరని, లేనిపక్షంలో ఆయా సామాజికవర్గాలు తమ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంటుందని, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నేతలపై ఇతరులు తీవ్ర ఆరోపణలు చేయడం మంచిది కాదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మోహన్ బాబు కోసం...ఎందుకంటే?

మోహన్ బాబు కోసం...ఎందుకంటే?

జగన్ కోరుకున్న కేటగిరిలో ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తిగా మోహన్ బాబును గుర్తించారట. కమ్మ సామాజికవర్గానికి చెందినా వ్యక్తులను నిర్మొహమాటంగా నిలదీయడంలో, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటంలో మోహన్ బాబు స్టైలే వేరనే సంగతి తెలిసిందే. అందులోనూ కులాన్ని నిరసించే వ్యక్తిగా, సొంత కులాన్నే అభిమానించడం తప్పనే విధంగా మోహన్ బాబు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకించి ఆంధ్రజ్యోతి అధినేత ఆర్కేనే మీకు కులగజ్జి ఉందని అందరూ అనుకుంటున్నారని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలపై మోహన్ బాబు లాంటి వారితో విమర్శలు చేయించడం పార్టీకి శ్రేయస్కరమని జగన్ భావిస్తున్నారని తెలిసింది.

రావడం మాత్రం పక్కానే...కానీ పార్టీనే

రావడం మాత్రం పక్కానే...కానీ పార్టీనే

మోహన్ బాబు కూడా తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లుగానే కొంతకాలం క్రితం బహిరంగవేదికల్లో మాట్లాడిన సందర్భాల్లో సంకేతాలు ఇచ్చారు.
ముఖ్యంగా తన జన్మదినం సందర్భంగా ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఆ సందర్భంలో తాను ఏ పార్టీలో చేరే విషయాన్ని చూచాయగానైనా ఆయన వెల్లడించలేదు. ఏ పార్టీలో చేరేది తర్వాత చెబుతానని మోహన్ బాబు చెప్పారు.పైగా ఇటీవల మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో సమావేశం కావడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయమై మోహనబాబు వివరణ ఇస్తూ ముద్రగడ పద్మనాభం తనకు చిరకాల మిత్రుడని, విష్ణు ఆ దగ్గరలో ఓ పెళ్లుంటే వెళ్లాడని, తన సూచన మేరకు ఆయనను పరామర్శించి వచ్చాడని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు స్పష్టం చేశారు.అయితే దీనివెనుక ఏదో రాజకీయ కోణం ఉందనే అందరూ నమ్ముతున్నారు.

ఈ కారణాలతో.. ఖాయం

ఈ కారణాలతో.. ఖాయం

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి వేడుకల సందర్భంగా నారావారిపల్లి విచ్చేసిన సందర్భంలో ఆయనతో ఏకాంత చర్చలు జరిపిన మోహనబాబు ఏకంగా టిడిపిలో చేరుతానని తానే అడిగారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డి ద్వారా మోహన్ బాబు వైయస్ కుటుంబానికి బాగా దగ్గర బంధువులుగా మారారు. కాబట్టి మోహన్ బాబును ఒప్పించి మెప్పించి వైసిపిలోకి తీసుకురావడం జగన్ సాధిస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మోహన్ బాబు చేరికను తమ పార్టీకి ఎలా ప్లస్ గా మార్చుకోవాలో ఆ పార్టీ అప్పుడే ప్రణాళిక కూడా సిద్దం చేసేసిందనేది మరో టాక్. ఏదేమైనా అతి కొద్ది రోజుల్లోనే మోహన్ బాబు రీ ఎంట్రీపై సస్పెన్స్ వీడిపోవడం ఖాయమనేది వైసిపి శ్రేణులు భావిస్తున్నాయి.

English summary
Actor Mohan Babu has decided to re enter into active politics but still he is tight lipped over announcing the political party that he would be joining.In this context, It is known that Jagan is trying to make Mohan babu an entry into YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X