తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదంలో మోహన్ బాబు స్కూల్: న్యాయ పోరాటానికి టీచర్.. అసలేం జరిగింది?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Teacher Sacked For Wearing Jeans In Tirupati

తిరుపతి: నటుడు మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై రాణిరవడ(43) అనే మహిళా టీచర్ న్యాయ పోరాటానికి దిగింది. కేవలం తన దుస్తుల్ని కారణంగా చూపించి ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరో టీచర్ కూడా అలాంటి దుస్తులే వేసుకొస్తున్నా.. కావాలని తనను మాత్రమే స్కూల్ నుంచి తప్పించారని అంటోంది.

ఎందుకు తొలగించారు..:

ఎందుకు తొలగించారు..:

ఫార్మల్ ప్యాంట్, లాంగ్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని స్కూల్‌కు వచ్చిందన్న కారణంతో రాణిరవడను శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తొలగించింది.గత డిసెంబర్ 7న పాఠశాల యాజమాన్యం ఆమెకు తొలగింపు ఉత్తర్వులను ఇచ్చింది.

స్కూల్ ప్రమాణాలకు విరుద్దమని..:

స్కూల్ ప్రమాణాలకు విరుద్దమని..:

శ్రీ విద్యానికేతన్ నియామవళికి విరుద్దంగా రాణిరవడ టీచర్ క్లాజ్ 11, 13లను ఉల్లంఘించిందని యాజమాన్యం ఆరోపిస్తోంది. సకాలంలో సిలబస్ కూడా పూర్తి చేయలేదని ఆరోపించింది. స్కూల్ ప్రమాణాలకు విరుద్దంగా వస్త్రధారణ ఉండటం వల్లే ఆమెను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

బాధితురాలి వాదన:

బాధితురాలి వాదన:


గతేడాది సెప్టెంబర్ 4న తాను శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరినట్లు టీచర్ రాణి తెలిపారు. సిలబస్ పూర్తి చేయలేదన్న ఆరోపణలు తనను తొలగించడం కోసం సృష్టించినవే అన్నారు. అమర్యాదకరంగా తనను తొలగించారని పేర్కొన్నారు.

న్యాయపోరాటం చేస్తా..:

న్యాయపోరాటం చేస్తా..:

రాత పూర్వక ఆదేశాలు ఇవ్వక ముందే స్కూల్ చైర్మన్ తనను ఇలాంటి దుస్తులు వేసుకోవద్దని ఆదేశించారని రాణి తెలిపారు. వేరే జాతీయత కలిగిన మరో టీచర్ అలాంటి వస్త్రధారణతోనే స్కూల్ కు వస్తున్నారని, కేవలం తాను తెలుగు వ్యక్తిని అయినందువల్లే తనను తొలగించారని ఆమె ఆరోపించారు. యాజమాన్యం తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకునేంతవరకు న్యాయపోరాటం చేస్తానని తెలియజేశారు.

English summary
According to the reports Actor Mohan Babu's school Srividyaniketan managmentremoved a teacher for wearing pant and jeans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X