వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావో అగ్రనేత ఆర్ .కె .గాయపడ్డాడు, లొంగిపోతే చికిత్స చేయించేందుకు ప్రభుత్వం సిద్దం

అక్టోబర్ 24, తేదని ఆంద్ర ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ గాయపడ్డారని , ఆయనకు మెరుగైన చికిత్స అవసరమని మల్కన్ గిరి ఎస్ పి మిత్రభాను మహపాత్ర చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : ఆంద్ర ఒడిశా సరిహద్దులో అక్టోబర్ 24వ, తేదిన జరిగిన ఎన్ కౌైంటర్ లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ గాయపడ్డారని మల్కన్ గిరి ఎస్ పి మిత్రబాను మహపాత్ర చెప్పారు. లొంగిపోతే రామకృష్ణకు చికిత్స చేసుకొనేందుకు ఒడిశా ప్రభుత్వం అనుమతిస్తోందని చెప్పారు.

మల్కన్ గిరి ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ గాయపడ్డారని మల్కన్ గిరి ఎస్ పి మిత్రభాను ప్రకటించడం కలకలం రేపుతోంది. ఈ ఎన్ కౌంటర్ తర్వాత రామకృష్ణ ఆచూకీ కోసం చాల రోజుల వరకు ఆర్ కె సతీమణి హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎట్టకేలకు రామకృస్ణ సురక్షితంగానే ఉన్నట్టు హక్కుల సంఘాలకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా ఆర్ కె సతీమణి శీరీష కోర్టులో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకొంది.

moist top leader ramakrishna injured in an encounter

ఈ ఘటన జరిగిన పదిహేను రోజులకు మల్కన్ గిరి ఎస్ పి చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో రామకృష్ణ మరణించారని తొలుత పోలీసులు అనుమానించారు. అయితే ఈ ఘటన స్థలం నుంచి తప్పించుకొన్నారని ఆ తర్వాత ప్రకటించారు. ఎన్ కౌంటర్ లో రామకృష్ణ గాయపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఆర్ కె తనయుడు మున్నా ఉన్న శిభిరంలోనే ఆయన ఉన్నాడని అయితే ఎన్ కౌంటర్ నుండి ఆయన చాకచక్యంగా తప్పించుకొన్నారని ఎస్ పి చెప్పారు.

తాజాగా మల్కన్ గిరి ఎస్ పి మిత్రభాను ఇదే అంశాన్ని ప్రకటించారు. ఆర్ కె కాళ్ళకు గాయాలయ్యాయని చెప్పారు. ఆయనకు వైద్యం చేయించుకొనేందుకు ఒడిశా ప్రభుత్వం కూడ సానుకూలంగా ఉందన్నారు. అయితే ముందుగా ఆయన లొంగిపోవాలని ఆయన షరతు విధించారు.ఆంద్ర. ఒడిశా సరిహద్దులో ఆర్ కె రహస్య ప్రాంతంలో చికిత్స పొందుతున్నట్టు అనుమానాన్ని వ్యక్తం చేశారు.రెండు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో నిఘాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం నాటు వైద్యం ద్వారా చికిత్స పొందుతున్నారని చెప్పారు. మెరుగైన వ్యైద్యం ఆసుపత్రుల్లోనే సాద్యమన్నారు ఎస్ పి

English summary
maoist top leader ramakrishna injured an encounter held on oct 24 at andhra- odissa border . around 34 maoists dead in an encounter.ramakrishna injured this an encounter said malkangiri sp mithrabhanu. after surrender , odissa governament shall provide treatment said sp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X