వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోకా భాస్కరరావు హత్య కేసు ఛేదించిన పోలీసులు, చింతా చిన్ని సహా ఇద్దరి అరెస్ట్, మరికొందరు విచారణ..

|
Google Oneindia TeluguNews

వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. టీడీపీ నేత చింతా చిన్ని సహా మరో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ ఆధిపత్యం కోసంమే భాస్కరరావును హత్య చేశారని పోలీసుల విచారణలో నిర్దారణ అయ్యింది. హత్య కేసులో మరికొందరినీ విచారిస్తారు.

చింతా చిన్ని అరెస్ట్

చింతా చిన్ని అరెస్ట్

మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. జూన్ 29వ తేదీన బందర్ నడిబొడ్డున కత్తితో పొడిచి హత్యచేసిన సంగతి తెలిసిందే. అయితే చింతా చిన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడు. అతని ప్రోద్బలంతోనే హత్య జరిగిందని భాస్కరరావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టగా.. చింతా చిన్ని సహా మరో ఇద్దరు హత్యలో పాలుపంచుకున్నారని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.

వివాదం ఇందుకే

వివాదం ఇందుకే


గుమ్మటాల చెరువు విషయంలో భాస్కరరావు, మాజీమంత్రి కొల్లు రవీంద్రకు వివాదం ఉందని భాస్కరరావు అన్న కుమారుడు మోకా రాజేశ్ కన్నా తెలిపారు. మత్స్యకార కుటుంబానికి చెందిన భాస్కరరావు.. తన అనుచరుల సమస్యను తన ప్రాబ్లంగా భావించి పరిష్కరించేవారు. ఆయన రాజకీయంగా ఎదిగే క్రమంలో కొందరు ఓర్వలేరని రాజేశ్ చెబుతున్నారు.

పట్టపగలు

పట్టపగలు


సోమవారం ఉదయం 11.30 గంటలకు కోనేరు సెంటర్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు నిల్చొన్న భాస్కరరావును తోసేయగా.. కింద పడిపోయాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఛాతిలోకి పొడిచారు. కత్తి పోట్లకు జేబులో ఉన్న మొబైల్ పేలిపోయింది. ఒంటిపై ఉన్న చొక్కా కాలి.. శరీరంపై గాయాలు ఏర్పడ్డాయి. గుండెలో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆస్పత్రికి తరలించే మార్గంలో భాస్కరరావు చనిపోయారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
అండగా..

అండగా..


మోకా భాస్కరరావు, అతని తండ్రి మోకా రామయ్య.. పేర్ని నాని కుటుంబానికి అండగా ఉంటున్నారు. నాని తండ్రి, మాజీమంత్రి పేర్ని కృష్ణమూర్తికి రామయ్య అనుచరుడిగా ఉన్నారు. రామయ్య కౌన్సిలర్‌గా పనిచేశాడు. తర్వాత భాస్కర్ రావు తన భార్యను కౌన్సిలర్‌గా గెలిపించుకున్నాడు. తన సామాజికవర్గం కోసం పాటుపడుతూ.. రాజకీయంగా ఎదుగుతున్న భాస్కర్‌రావుపై ప్రత్యర్థులు మట్టుబెట్టారని కుటుంబసభ్యులు గట్టిగా వాదించారు. ఈ మేరకు విచారించగా చింతా చిన్న సహా మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

English summary
moka bhaskar rao murder case chase: ycp leader moka bhaskar rao murder case chased by police. chinta chinni another two persons are arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X