వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే భాస్కర్ రావు హత్య, పోలీసులకు నిందితుల వాంగ్మూలం

|
Google Oneindia TeluguNews

వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య చేసిన ఇద్దరు నిందితులు, వారితో హత్య చేయించారని భావిస్తోన్న చింతా చిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితులు తమ వాంగ్మూలంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హత్య చేశామని తెలిపారు. దీంతో కేసు కీలక దశకు చేరుకుంది. అంతకుమందే పోలీసులు కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయన కనిపించడం లేదు.

వాంగ్మూలం రికార్డు

వాంగ్మూలం రికార్డు


నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేశామని ఆర్ పేట డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. కొల్లు రవీంద్ర ఆచూకీ కనుగొనేందుకు మూడు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే అతనిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.

పట్టపగలు హత్య

పట్టపగలు హత్య

జూన్ 29వ తేదీన బందర్ నడిబొడ్డున కత్తితో పొడిచారు. ఉదయం 11.30 గంటలకు కోనేరు సెంటర్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో దాడి జరిగింది. ఇద్దరు ఆగంతకులు నిల్చొన్న భాస్కరరావును తోసేయగా.. కింద పడిపోయాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఛాతిలోకి పొడవడంతో భాస్కర్ రావు చనిపోయారు.

రవీంద్ర ప్రోద్బలంతోనే..

రవీంద్ర ప్రోద్బలంతోనే..

మోకా భాస్కరరావు, అతని తండ్రి మోకా రామయ్య.. పేర్ని నాని కుటుంబానికి అండగా ఉంటున్నారు. నాని తండ్రి, మాజీమంత్రి పేర్ని కృష్ణమూర్తికి రామయ్య అనుచరుడిగా ఉన్నారు. రామయ్య కౌన్సిలర్‌గా పనిచేశాడు. తర్వాత భాస్కర్ రావు తన భార్యను కౌన్సిలర్‌గా గెలిపించుకున్నాడు. తన సామాజికవర్గం కోసం పాటుపడుతూ.. రాజకీయంగా ఎదుగుతున్న భాస్కర్‌రావుపై ప్రత్యర్థులు మట్టుబెట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. వారి ఆరోపణలకు బలం చేకూరేలా.. నిందితులు కూడా వాంగ్మూలం ఇవ్వడంతో.. హత్యలో కొల్లు రవీంద్ర పాత్ర స్పష్టమవుతోంది.

English summary
ycp leader moka bhaskar rao murder influenced by ex minister kollu ravindra police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X