• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోక్షజ్ఙ అద్భుత భవిష్యత్తును ఎప్పుడో డిసైన్ చేసా.!ఉప్మా,పూరి,ఇడ్లీ,సాంబార్ ఏవన్నా అనుకోండన్న బాలయ్య

|

హైదరాబాద్ : హిదూపూర్ ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెర వెనక ఎంతో కలగలుపుగా ఉన్నా మీడియా ముందు మాత్రం ఎప్పుడూ హుందాగా వ్యవహరిస్తుంటారు. బాలయ్యాను అత్యంత సన్నిహితంగా చూసిన వాళ్లంతా బాలయ్యలో పసితనం ఇంకాపోలేదు అంటూ పోగడ్తలతో ముంచెత్తుతుంటారు. అంటే ఎదుటి వాళ్ల దగ్గర అంత కళ్లాకపటం లేకుండా వ్యవహరించడం చిత్ర పరిశ్రమలో ఒక్క బాలయ్య బాబుకే సాద్యమని చెప్పుకొస్తుంటారు కొంత మంది ప్రముఖలు. ఇదిలా ఉండగా వెండి తెర మీద ఎన్నో పాత్రలను అలవోకగా పోషించి మెప్పించిన బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఙ సినీ రంగ ప్రవేశం గురించి మాత్రం ఆచితూచి స్పందించారు.

తన తనయుడు మోక్షజ్ఙ గురించి స్పందించిన బాలయ్య.. అద్బుత లాంచింగ్ ఉంటుందన్న నటసింహం..

తన తనయుడు మోక్షజ్ఙ గురించి స్పందించిన బాలయ్య.. అద్బుత లాంచింగ్ ఉంటుందన్న నటసింహం..

తన పుట్టిన రోజు సందర్బంగా బాలకృష్ణ ఓ తెలుగు టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో అనేక అంశాలను స్పృశించారు. తన సినీ ప్రయాణం గురించి, చేయబోయే సినిమాల గురించి, కూతురు బ్రహ్మిణి గురించి స్పందించారు బాలయ్య. అంతే కాకుండా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా సున్నితంగా స్పందించారు నట సింహం. ఉత్కంఠ పరిణామాల మద్య హిందూపూర్ లో గెలవడం పట్ల కూడా స్పందించారు. చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలే తనను గెలిపించాయని తెలిపారు. తాను నియోజక వర్గాన్ని పట్టించురోవడం లేదని ఎన్నో అపోహలు కల్పించే ప్రయత్నం చేసినా తాను గెలిచానని బాలయ్య గుర్తు చేసారు.

బ్రహ్మిణి దగ్గర మంచి వ్యాపార మెలకువలు ఉన్నాయి.. లోకేష్ రాజకీయాల్లో రాటుదేలుతున్నాడన్న బాలయ్య..

బ్రహ్మిణి దగ్గర మంచి వ్యాపార మెలకువలు ఉన్నాయి.. లోకేష్ రాజకీయాల్లో రాటుదేలుతున్నాడన్న బాలయ్య..

అంతే కాకుండా కూతురు బ్రహ్మిణి, అల్లుడు లోకేష్ గురించి కూడా బాలయ్య సున్నితంగా స్పందించారు. లోకేష్ అనుకున్నది సాధించే వరకూ విశ్రమించడని, మంచి పట్టుదల ఉన్న వ్యక్తని, రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే రాటు దేలుతున్నాడని అభివర్ణించారు. ఇక బ్రహ్మిణి గురించి మాట్లాడుతూ ఇంట్లో క్రమశిక్షణ,సంస్కారం గురించి ఎంతో నేర్చకున్న తర్వాతే సమాజాన్ని చూసిందని తెలిపారు. తాను వ్యాపారంలో రాణించడం ఎంతో హర్షించదగ్గ అంశమని బాలయ్య అభివర్ణించారు. చివరగా నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఙ సినీ ప్రవేశం గురించి కూడా ఆచితూచి స్పందించారు బాలకృష్ణ.

మోక్షజ్ఙ దర్శకుడు ఎవరన్నా అనుకోండి.. ఉప్మా, పూరీ, సాంబార్, ఇడ్లీ చెప్పుకోండన్న బాలకృష్ణ..

మోక్షజ్ఙ దర్శకుడు ఎవరన్నా అనుకోండి.. ఉప్మా, పూరీ, సాంబార్, ఇడ్లీ చెప్పుకోండన్న బాలకృష్ణ..

కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఙ పరిశ్రమ ప్రవేశం గురించి వాడి వేడి చర్చ మొదలైంది. ఎప్పుడైనా మోక్షజ్ఙ సినీ ప్రవేశం ఉండొచ్చనే సంకేతాలను వెల్లడించారు బాలకృష్ణ. దీంతో మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో కధానాయకుడిగా పరిచయం అవుతారు అనే అంశంపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అందుకు బాలకృష్ణ కూడా ఎంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎవరి దర్శకత్వంలో ప్రవేశం ఉంటుంది అనే అంశాన్ని తేల్చకుండానే కొంత హాస్యాన్ని జోడించి చమత్కరించారు బాలయ్య. కాని అద్బుతమైన భవిశ్యత్తును మాత్రం మోక్షజ్ఙ కోసం డిసైన్ చేసానని బాలయ్య స్పష్టం చేసారు.

మోక్షజ్ఙ కోసం అద్బుత కథలు సిద్దం చేసా.. గ్రాండ్ లాంచింగ్ ఉంటుందన్న బాలయ్య..

మోక్షజ్ఙ కోసం అద్బుత కథలు సిద్దం చేసా.. గ్రాండ్ లాంచింగ్ ఉంటుందన్న బాలయ్య..

ఇదే క్రమంలో తన వారసుడి ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఓ ఇంటర్వ్యూలో పూరీ దర్శకత్వంలో మోక్షజ్ఞ చిత్రరంగ ప్రవేశం చేయబోతున్నారట కదా అని అడగ్గా బాలయ్య ఎంతో ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పూరీతో పాటు సాంబార్ ఇడ్లీ, ఉప్మా పేర్లు కూడా చెప్పండి అంటూ కాస్త వ్యంగంగా స్పందించారు బాలయ్య. తర్వాత మాట్లాడుతూ మోక్షజ్ఙను కథానాయకుడిగా ఎలా చిత్రపరిశ్రమలో పరిచయం చేయాలో తనకు తెలుసని అన్నారు. అంతేకాకుండా కొన్ని అద్బుతమైన కథలను సిద్దం చేసినట్టు బాలయ్య వివరించారు. మరి మోక్షజ్ఞను ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనే అంశంపై స్పష్టత రావాలంటే మాత్రం నందమూరి అబిమానులు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!

English summary
There is interesting debate as to whose direction Mokshagna will be introduced as a hero. Balakrishna also made very interesting comments. Balayya, who has added some humor without making a point.But Balaya has made it clear that he has designed the exciting future for Mokshagna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more