వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలే కోతి, ఆపై మందు తాగి, హంగామా చేసింది

అసలే కోతి ఆపై మద్యం తాగి హాంగామా చేసింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి వద్ద మద్యం దుకాణం వద్ద మద్యం కోసం తిరుగుతున్న ఓ కోతికి ఓ వ్యక్తి మద్యం పోసిన గ్లాసు ఇచ్చాడు. ఆ మద్యం తాగిన కోతి తన ప్రతాపాన్న

By Narsimha
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా : అసలే కోతి ఆపై కల్లు తాగిందనే నానుడి గుర్తుండే ఉంటుంది.అక్షరాల ఓ కోతి మద్యం దుకాణం వద్ద మందు తాగి నానా హాంగామా చేసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.

తూర్పుగోదావరి జిల్లాలోని కొత్త పల్లిలోని మద్యం దుకాణం వద్ద ఓ కోతి మందు కోసం తిరుగుతోంది. మద్యం తాగి పారేసిన ప్లాస్టిక్ గ్లాసుల్లో మద్యం కోసం వెతుకుతూ కన్పించింది.

monkey

మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఈ కోతి పడుతున్న ఇబ్బందిని చూశాడు. తాను కొనుగోలు చేసిన మద్యాన్ని కొంత ప్లాస్టిక్ గ్లాసులో పోసి కోతికి దగ్గరగా ఉంచాడు.ఇంకేముంది ఆ కోతి ప్లాస్టిక్ గ్లాసులో ఉన్న మద్యాన్ని ఖాళీ చేసింది. ఎత్తని గ్లాసు దించకుండా మద్యాన్ని పూర్తిచేసింది.

మద్యం తాగిన కోతి మాములుగా ఉంటుందా, అసలే కోతి ఆపై కల్లు తాగిందనే సామెతను గుర్తుచేసింది. మద్యం దుకాణం పక్కనే ఉన్న తినుబండారాల దుకాణంపై దాడి చేసింది. ఉడకబెట్టిన కోడిగుడ్డును తీసుకొని తిన్నది.

మద్యం దుకాణం పక్కన ఉన్న దుకాణలపై పడి చిందరవందర చేసింది. మద్యం మత్తులో ఆ కోతి చేసే పనులతో స్థానికులు కొంత సేపు ఇబ్బంది పడ్డారు. దీంతో వారంతా ఆ కోతిని తరిమికొట్టారు. అసలే కోతి మద్యం తాగితే మామూలుగా ఉంటుందా , ఆ సామెతేనే నిజం చేసింది.

English summary
monkey attacks on shops after drinking beer, this inicdent happend in eatgodavari district. a man offered beer to monkey at kottapalli village in east godavari district ,after driniking beer monkey attack on shops beside wine shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X