అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిలో చోరీలు చేస్తున్న కోతులు: శిక్షణ ఇచ్చారా?(వీడియో)

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కొత్త దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నాయి. దుకాణాల్లో దూరి నగదు కౌంటర్లోని డబ్బులను దోచుకెళుతున్నాయి. వింతగా ఉన్నా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నవి కోతులే. దీంతో దుకాణాల యజమానులు కోతులను చూస్తే హడలిపోతున్నారు.

కాగా, కోతుల దొంగతనాలు చేస్తుండగా పలు దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మే 23న కోతులు దొంగతనాలకు పాల్పడ్డాయి. క్యాష్ కౌంటర్లోని నగదును దోచుకెళ్లాయి. ఆ హోటల్ యజమాని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించడంతో అతనికి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది.

Monkey caught robbing shops in Amaravati

ఎవరో కొందరు.. కోతులకు శిక్షణ ఇచ్చి దొంగతనాలకు ఉసిగొల్పుతున్నారని దుకాణ యజమానులు అనుమానిస్తున్నారు. పలు పండ్ల దుకాణాల్లో కూడా కోతులు దొంగతనాలకు పాల్పడ్డాయి. భాస్కర్ రావు అనే నగదు వ్యాపారి కోతికి పండు ఇవ్వగా, అది క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి 30 నిమిషాలు అక్కడే కూర్చింది.
దీంతో దాన్ని తరిమేసేందుకు ప్రయత్నించినా అది వెళ్లలేదు. అంతేగాక, క్యాష్ కౌంటర్‌లోని రూ. 10వేల నోట్ల కట్టను అందుకుని పారిపోయిందని సదరు వ్యాపారి రావు తెలిపారు.

తన షాపులోని సిబ్బంది దాన్ని వెంబడించగా డబ్బులను వదిలేసి కోతి పారిపోయిందని చెప్పారు. ఎవరో కోతులకు శిక్షణ ఇచ్చినందువల్లే ఇవి దొంగతనాలకు పాల్పడుతున్నాయని తెలిపారు.

ఐదు రోజుల క్రితం అంజనేయ హోటల్‌లో కూడా రూ. 10వేల నోట్ల కట్టను ఓ కోతి దొంగలించిందని చెప్పారు. అక్కడ కూడా సిబ్బంది వెం పడటంతో డబ్బును వదిలేసి కోతి పారిపోయిందని తెలిపారు. కాగా, కోతుల బారి నుంచి తమను కాపాడాలని పలువురు వ్యాపారులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
In a bizarre incident, a monkey picked up Rs 10,000 from a jewellery shop at Piduguralla in Guntur district on May 23. The incident came to light after CCTV images of the incident went viral on social media. The monkey dropped the money when it was chased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X