తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో 12మంది భక్తులపై కోతుల దాడి: ఆస్పత్రికి తరలింపు

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల క్షేత్రంలో భక్తులపై కోతుల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం జిఎన్సీ టోల్ గేట్ వద్ద ఇద్దరు భక్తులపై కోతులు దాడి చేశాయి. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటి వరకు కోతుల దాడిలో 12మంది భక్తులు గాయపడ్డారు. వారందర్నీ ఆస్పత్రికి తరలించారు.

tirumala

తిరుమలలో సాధారణంగానే భక్తుల రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 9 కంపార్టుమెంట్లు నిండాయి.

గురువారం ఉదయం 6 గంటలకు అందిన సమాచారం గదుల వివరాలిలా ఉన్నాయి. ఉచిత గదులు - 46, రూ.50 గదులు - 12, రూ. 100 గదులు - 16, రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి.

ఆర్జిత సేవా టికెట్ల వివరాలిలా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు. సహస్ర దీపాలంకరణ సేవ - 45 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - 11 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ: తిరుప్పావడ నిర్వహించనున్నారు.

English summary
Some Monkeys attacked on 12 devotees at Tirumala on Thursday morning. They were all hospitalized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X