వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఇంటి తిండి నో: మోపిదేవికి తాత్కాలిక బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan and Mopidevi
హైదరాబాద్: చంచల్‌గుడా జైలులో తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టేసింది. ఇటీవల సమైక్యాంధ్రకు మద్దతుగా నిరాహార దీక్ష చేసిన జగన్ నిజాం వైద్య విజ్ఝాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందారు. దాంతో జగన్‌కు ఇంటి భోజనం పెట్టాలని వైద్యులు సూచించారు. అందుకు అనుగుణంగా తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని కోరుతూ వైయస్ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉంటున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఊరట లభించింది. ఆరోగ్య కారణాలపై ఆయనకు కోర్టు 45 రోజుల పాటు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. చికిత్స నిమిత్తం అక్టోబర్ 31వ తేదీ వరకు మోపిదేవికి షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది.

పూర్తి సమయాన్ని వైద్యచికిత్సకు మాత్రమే వాడుకోవాలని, ఇతరత్రా వ్యవహారాలకు వాడకూడదని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల సంతకాలతో కూడిన పూచీకత్తును, లక్ష రూపాయల జమానతును సమర్పించాలని కోర్టు మోపిదేవిని ఆదేశించింది. బెయిల్ కాలంలో సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు సూచించింది. హైదరాబాద్ విడిచి వెళ్లకూడదని కూడా కోర్టు ఆయనను ఆదేశించింది.

మోపిదేవి వెన్నునొప్పి, రక్తంపోటుతో బాధపడుతున్నారని చెబుతూ చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్‌పై ఐదు రోజుల పాటు వాదప్రతివాదనలు జరిగాయి. మోపిదేవి వెంకటరమణ ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. ఆయన జగన్ ఆస్తుల కేసులోని వాన్‌పిక్ వ్యవహారంలో సిబిఐ చేతిలో అరెస్టయ్యారు.

English summary
Court has rejected YSR Congress party president YS Jagan's petition filed seeking food supply from his residence. Meanwhile, former minister Mopidevi venkataramana has been granted interim bail for 45 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X