వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కర్ప్యూ సక్సెస్‌- 21 నుంచి మరిన్ని సడలింపులు- సాయంత్రం 6 వరకూ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గతంలో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండగా... రికవరీల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అటు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. దీంతో కర్ఫ్యూ నిబంధనల్ని సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇవాళ స్పందన కార్యక్రమంలో ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడిన సీఎం జగన్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్‌ అధికారులతో నిర్వహించిన సమీక్షలో తాజా వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెల రోజులుగా విధించిన కర్ప్యూ సక్సెస్ అయిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో జూన్‌ 20తో కర్ఫ్యూ నిబంధనలు ముగియనున్న నేపథ్యంలో 21 నుంచి మినహాయింపులు మరింత పెంచుతూ కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు.

more curfew relaxations in ap from june 21 in wake of decline in covid new cases

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.

ఏపీలో మూడున్నర కోట్ల మందిలో 69 లక్షల మందికి ఇప్పటివరకూ వ్యాక్సిన్ సింగిల్‌ డోస్ ఇచ్చినట్లు జగన్ తెలిపారు. అలాగే 26.33 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చామన్నారు. గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో 89 శాతం మంది కోవిడ్‌ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారని సీఎం పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్సకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ధర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులు సిద్ధం చేస్తున్నట్లు జగన్ తెలిపారు.

English summary
andhrapradesh government plans to increase curfew relaxations from june 21 in wake of latest decine in new covid cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X