• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జనసేన రియాక్షన్ తో టిడిపికి మరింత డ్యామేజ్

|

అమరావతి: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ టిడిపిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతకాలం చంద్రబాబునాయుడుకు పవన్ అనుకూలమనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉండేది. పవన్ వ్యవహారం కూడా అందుకు తగినట్లే ఉండేది. అయితే బుధవారం జన సేన సభలో పవన్ చేసిన ప్రసంగం అందరినీ షాక్ కు గురిచేసింది.

  చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు : గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఎందుకిచ్చావ్ పవన్ ?

  తన గత స్పీచ్ లకు పూర్తి భిన్నంగా...సూటిగా...సుత్తి లేకుండా...స్పష్టంగా టిడిపిని పవన్ టార్గెట్ చేస్తూ ఒక్కో విమర్శ చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఒక్కో ఫ్యూజ్ ఎగిరిపోతున్న పరిస్థితిని తలపించింది. అయితే అడపాదడపా బిజెపి,వైసిపిలపై పవన్ విమర్శలు చేసినా టిడిపిని వివిధ కోణాల్లో కార్నర్ చేస్తూ సాగిన విమర్శలే హైలెట్ గా మారాయి. అయితే కథ ఇంతటితో ముగిసిపోలేదు...ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో జనసేన చేసిన మరికొన్ని ట్వీట్స్ చంద్రబాబుకు మరింత డ్యామేజ్ చేసేలా వున్నాయి.

  పవన్ పై...ఎదురుదాడులు...

  పవన్ పై...ఎదురుదాడులు...

  జనసేనాని తమపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలను తిప్పికొట్టేందుకు టిడిపి నానాతంటాలు పడుతోంది...దూకుడు సినిమా డైలాగ్ తరహాలో ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా...బుల్లెట్ దిగిందా లేదా?...అన్న చందంలో పవన్ కళ్యాణ్ తూటాల్లాంటి మాటలకు టిడిపి విలవిల్లాడింది. అందుకే పవన్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం నిరసనలు మొదలుపెట్టింది. చంద్రబాబు, లోకేష్, టిడిపి లక్ష్యంగా పవన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. అనేక చోట్ల పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.

   షో చేస్తారనుకుంటే...షూట్ చేశారు...

  షో చేస్తారనుకుంటే...షూట్ చేశారు...

  చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటమే పవన్ కళ్యాణ్ పని అని అత్యధికులు భావిస్తున్నతరుణంలో జనసేన ఆవిర్భావ దినోత్పవంలో అలాగే జరుగుతుంది. ఈ సభలో కూడా పవన్ కల్యాణ్ ఎప్పట్లాగే చంద్రబాబుకు సుతిమెత్తని హెచ్చరికలతో సరిపెట్టి...జగన్ కు యథావిధిగా వాతలు పెడతారని అందరూ భావించారు. అయితే పవన్ అనూహ్యంగా తన గత వైఖరికి భిన్నంగా టిడిపినే ప్రధానంగా టార్గెట్ మాట్లాడటమే కాదు మాట్లాడిన విధానం కూడా కొత్త గా ఉండటంతో జనాలు ఆశ్చర్యపోయారు. దీంతో పవనే ప్రశ్నించినట్లు ఇంకా ఎవరైనా నన్ను చంద్రబాబే మాట్లాడిస్తున్నారని అనగలరా?...సవాలు కు సమాధానం లేకుండా చేయగలిగారు.

  పవన్ కు...భద్రత పెంపు...

  పవన్ కు...భద్రత పెంపు...

  దీంతో పవన్ నుంచి ఈ తరహా ఎదురుదాడిని అసలు ఊహించని టిడిపి పవన్ పై నిరసలకు శ్రీకారం చుట్టింది. అందేకాకుండా పవన్ పై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందన్నకారణంగా ముందుజాగ్రత్తగా పవన్ బసచేసిన హోటల్ వద్ద భద్రతను భారీగా పెంచారు. అలాగే పవన్ రాకపోకలపై భద్రతాపరమైన నిఘా ఉంచి...పోలీసుల పర్యవేక్షణకు ప్రాధాన్యం పెంచారు.

  జనసేన ట్వీట్స్...మరింత డ్యామేజీ...

  జనసేన ట్వీట్స్...మరింత డ్యామేజీ...

  పవన్ కళ్యాణ్ పై టిడిపి నేతల విమర్శలు...హెచ్చరికల నేపథ్యంలో జనసేన డిజిటల్ విభాగం చేసిన కొన్ని ట్వీట్స్ టిడిపిని,చంద్రబాబును మరింత డ్యామేజీ చేశాయి. జనసేన చేసిన ఆ ట్వీట్స్ ఇవి..."రాష్ట్రంలో దేశంలో అనేక వ్యవస్థలు చేతిలో ఉన్న చంద్రబాబుని ఢీకొనటానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడ్డారు"..."మీడియా అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వాన్ని హననం చేయొచ్చు"..."వేరే ఇతర వ్యవస్థలను దుర్వినియోగపరిచి ఏమైనా చేయొచ్చు"..."పవన్ బలం, బలగం మనమే...కాబట్టి అనుక్షణం వేకువతో అందరూ జాగ్రత్తతో ఉండాలి" అంటూ జనసేన చేసిన ఈ ట్వీట్స్ చంద్రబాబు ప్రమాదకారి, కుట్రలకు పాల్పడతారనే సందేశాన్ని పరోక్షంగా జనాల్లోకి తీసుకెళ్లేవిధంగా ఉన్నాయి. దీనివల్ల టిడిపికి నష్టం వాటిల్లడంతో పాటు...చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎదురుదాడి చేయకుండా నివారించేలా పవన్ అమలు చేస్తున్న ప్లాన్లు టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Janasena Tweets that are more damaging TDP now. Pawan Kalyan has been targeted by TDP leaders in the for criticism of TDP. That's why Janesena has done with these tweets.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more