అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ నయా రికార్డు: లక్ష దాటిన కరోనా టెస్టింగులు: కొత్తగా 60 పాజిటివ్ కేసులు: ఇద్దరి మృతి

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా వైరస్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటిదాకా మొత్తం లక్షమందికి పైగా అనుమానితులకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది..రికార్డును నెలకొల్పింది. ఇప్పటిదాకా 1,02,460 మందికి కరోనా వైద్య పరీక్షలను నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 60 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

ఉద్ధవ్‌కు బిగ్ రిలీఫ్: మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు తీపి కబురు: ఈ నెల 27 నాటికి..ఉద్ధవ్‌కు బిగ్ రిలీఫ్: మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు తీపి కబురు: ఈ నెల 27 నాటికి..

403 మంది డిశ్చార్జి.. ఇద్దరి మృతి

403 మంది డిశ్చార్జి.. ఇద్దరి మృతి

ఫలితంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1463కు చేరుకుంది. ఇందులో యాక్టివ్‌గా ఉన్న పాజిటివ్ కేసులు 1027. కరోనా వైరస్ బారి నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయిన భారీ సంఖ్యలో ఉన్నారు. ఇప్పటిదాకా 403 మంది కరోనా పేషెంట్లు పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లారని అధికారులు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. కొత్తగా ఇద్దరు పేషెంట్లు మరణించినట్లు తెలిపారు. దీనితో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. నాలుగు రోజుల వ్యవధి తరువాత మృతుల సంఖ్య పెరగడం ఇదే తొలిసారి.

 కర్నూలు, గుంటూరుల్లోనే అధికం..

కర్నూలు, గుంటూరుల్లోనే అధికం..

24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికం కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 19 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీనితో ఈ రెండు జిల్లాల్లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కర్నూలులో-411, గుంటూరులో-306కు చేరుకున్నాయి. అదే సమయంలో- డిశ్చార్జి అయిన వారి సంఖ్య కూడా ఈ రెండు జిల్లాల్లోనే అత్యధికంగా నమోదు అయ్యాయి. గుంటూరులో ఇప్పటిదాకా 97 మంది పూర్తి ఆరోగ్యవంతులైన ఇళ్లకు వెళ్లగా.. కర్నూలులో 66 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఏడు జిల్లాల్లో జీరో కేసులు..

ఏడు జిల్లాల్లో జీరో కేసులు..

అనంతపురం, కడప జిల్లాల్లో ఆరు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు చొప్పున కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఏడు జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో 24 గంటల్లో కొత్త కేసులేవీ రాలేదు. విజయనగరం జిల్లాల్లో మొదటి నుంచీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

కర్నూలులో 411, గుంటూరులో 306,

కర్నూలులో 411, గుంటూరులో 306,

జిల్లాలవారీగా అనంతపురం-67, చిత్తూరు-80, తూర్పు గోదావరి 42, గుంటూరు-306, కడప-79, కృష్ణా-246, కర్నూలు-411, నెల్లూరు-84, ప్రకాశం్-60, శ్రీకాకుళం-5, విశాఖపట్నం-25, పశ్చిమ గోదావరి-58 కేసులు ఉండగా.. ఆయా జిల్లాల నుంచి 403 మంది కరోనా వైరస్ పేషెంట్లు ఇప్పటిదాకా డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం కేసుల సంఖ్య 1463 కాగా.. యాక్టివ్‌గా ఉన్నవి 1027.

English summary
More than 1 lakh Covid-19 testing completed in Andhra Pradesh. Total 1,02,460 Coronavirus testings completed in the State. 60 out of 7902 samples tested in the past 24 hours were positive case in Andhra Praesh. Total positive cases has reched at 1463, 1027 is active cases have registered and discharged: 403, Deceased: 33.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X