తల్లీకూతుళ్లపై కామాంధుడి అత్యాచారం: ఇంటికి నిప్పు
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కామాంధుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లీ కూతుళ్లపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.
అడ్డొచ్చిన స్నేహితుడిపై ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. ఇంట్లో వంటగ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు బాధితులను సజీవ దహనం చేసే యత్నం చేశాడు. 25 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బాలకృష్ణ కోసం గాలిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కొమరోలు మండలం దత్తవాడ దగ్గర ట్రాక్టర్ - ఇన్నోవాలు ఢీకొనడం వల్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లాలోని నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు.












Click it and Unblock the Notifications