వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుక్కి కరోనా పాజిటివ్ అని తెలిసినా రైల్వే గెస్ట్ హౌస్ లో దాచిన తల్లి .. ఉద్యోగం నుండి సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

ఒకపక్క ప్రపంచం కరోనాతో వణుకుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినా ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం కరోనా వ్యాప్తి చెందేలా చేస్తుంది . కరోనా బాధితులను ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుల్లో ఉంచాలని ప్రభుత్వాలు చెప్తుంటే మరోపక్క ఒక రైల్వే మహిళా ఎంప్లాయ్ తన కొడుక్కి కరోనా ఉందని తెలిసినా దాచిపెట్టి కొడుకుని రైల్వే గెస్ట్ హౌస్ లో ఉంచింది . దాంతో ఆ మహిళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు.

కరోనా విముక్త భారతం కోసం ప్రధాని మాట పాటిద్దాం: జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు కరోనా విముక్త భారతం కోసం ప్రధాని మాట పాటిద్దాం: జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు

 కరోనా పాజిటివ్ కొడుకును దాచిన ఓ రైల్వే మహిళా ఉద్యోగిని

కరోనా పాజిటివ్ కొడుకును దాచిన ఓ రైల్వే మహిళా ఉద్యోగిని

తల్లి ప్రేమ ఏ పనైనా చేయిస్తుంది. కరోనా పాజిటివ్ తో తన కొడుకు బాధ పడుతున్నాడు అంటే సమాజం దూరం పెడుతుందన్న భయమో , లేకా ఐసోలేషన్ వార్డుల్లో తన కొడుకును ఇబ్బంది పెడతారన్న అనుమానమో , లేకా వ్యాధి తగ్గకుంటే చంపేస్తారన్న అపోహనో తెలియదు కానీ స్పెయిన్ నుంచి వచ్చిన తన కొడుకు వివరాలను రహస్యంగా ఉంచింది ఆ తల్లి . అసలే కర్ణాటక రాష్ట్రం కరోనాతో వణుకుతుంటే తెలిసీ తెలియక చేసే పొరపాట్లు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే 16కరోనా కేసులు నమోదు అయ్యాయి . అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100మంది ఐసోలేషన్ వార్డుల్లో చేర్పించారు.

స్పెయిన్ నుంచి వచ్చిన కొడుక్కి కరోనా పాజిటివ్

స్పెయిన్ నుంచి వచ్చిన కొడుక్కి కరోనా పాజిటివ్

రైల్వేలో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఒక తల్లి తన కొడుకు కోసం రైల్వే కాలనీలోని గెస్ట్ హౌజ్ లో రూమ్ బుక్ చేసింది. ఇక అక్కడ తన కుమారుడిని ఉండమని చెప్పింది . అయితే మార్చి 13న బెంగళూరులోని కెంపెగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడే ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఇక అతనికి టెస్ట్ లు నిర్వహించారు. ఈ క్రమంలో అతని రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. ఇక ఈ విషయం బయటకు రాకుండా తల్లి మేనేజ్ చెయ్యాలని అనుకుంది.

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల హెల్త్ రిపోర్టు చెక్ చేసే సమయంలో బయటపడిన నిజం

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల హెల్త్ రిపోర్టు చెక్ చేసే సమయంలో బయటపడిన నిజం

ఇక అప్పటి నుండి కొడుకును రైల్వే గెస్ట్ హౌస్ లో ఉంచింది ఆ తల్లి . విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల హెల్త్ రిపోర్టు చెక్ చేస్తున్న క్రమంలో ఆ ఉద్యోగిని కొడుకు గురించి అడిగితే వివరాలు చెప్పకుండా దాచింది. నిజాలు తెలియడంతో కొడుకును హాస్పిటల్ కు పంపించి తల్లిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన స్థానికులు తన కొడుకు కోసం ఇతరుల జీవితాలను పణంగా పెట్టాలని అనుకుందని అంటున్నారు.

 మహిళా రైల్వే ఉద్యోగిని సస్పెండ్ .. సౌత్ వెస్టరన్ రైల్వే లో షాక్

మహిళా రైల్వే ఉద్యోగిని సస్పెండ్ .. సౌత్ వెస్టరన్ రైల్వే లో షాక్

తన కుటుంబానికి ఏం జరగకూడదని ఇంటికి దూరంగా గెస్ట్ హౌజ్ లో ఉంచిందని సౌత్ వెస్టరన్ రైల్వే అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఇక కరోనా పాజిటివ్ తో బాధ పడుతున్న ఆమె కొడుకును హాస్పిటల్‌లో చేర్పించారు. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా సౌత్ వెస్టరన్ రైల్వే ఉలిక్కిపడింది . అవగాహనకు బదులు అనుమానాలు ఉంటే ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు . అనవసరంగా కరోనా పాజిటివ్ ఉన్న కొడుకును దాచిపెట్టి ఉద్యోగానికి తిప్పలు తెచ్చి పెట్టుకుంది.

English summary
world is shaking with the corona, the carelessness of somewhere causes the corona to spread. If the government says corona victims should be kept in the hospital's isolation wards, then a railway woman employer hides her son in a railway guest house despite knowing that her son has corona positive. Officials said Friday that the woman was suspended .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X