India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నతల్లే కర్కశంగా... ఆడపిల్ల పుట్టిందని పసికందును గొంతులో వేలుపెట్టి హతమార్చిన ఘాతుకం

|
Google Oneindia TeluguNews

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న నేటి రోజుల్లోనూ ఆడ, మగ తేడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆడ, మగ తేడా లేదని .. ఆడ పిల్లలు సైతం కూడా అన్ని రంగాల్లో మగవాళ్లకు దీటుగా ముందుకు వెళుతున్నారని ఎవరు ఎంతగా ప్రచారం చేస్తున్నా, ఆడ పిల్లల మీద వివక్ష కొనసాగుతూనే ఉంది. ముక్కు పచ్చలారని పసిపిల్లలు అమానుష ఘటనలకు గురవుతూనే ఉన్నారు. ఆడపిల్లల ప్రాణాలు తీస్తున్న తల్లులు కొందరైతే, అంగట్లో ఆడపిల్లలను విక్రయిస్తున్న వారు ఇంకొందరు. చెత్త కుప్పల్లో, డ్రైనేజ్ లలో పడేస్తున్న వారు మరికొందరు. పేగు బంధాన్ని మరచిపోతున్న తల్లులు సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ పరిణామాలు ప్రస్తుతం సమాజంలో ఆందోళనకర పరిస్థితులకు కారణంగా మారుతున్నాయి.

గుంటూరు జిల్లాలో దారుణం .. ఐదు రోజుల పసికందు ప్రాణాలు తీసిన తల్లి

గుంటూరు జిల్లాలో దారుణం .. ఐదు రోజుల పసికందు ప్రాణాలు తీసిన తల్లి

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ అభంశుభం తెలియని ఐదు రోజుల పసికందును తల్లి కర్కశంగా హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి, నొప్పులుపడి మరీ కని, కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి, ఆ పసి దాని పట్ల కర్కశంగా వ్యవహరించింది. ప్రసవం తర్వాత 5 రోజులైనా కాకముందే పసిదాని ప్రాణాలు తీసింది. కన్నబిడ్డపై మమకారం లేని తల్లి అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది. అసలేం జరిగిందంటే గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పసికందును కన్నతల్లి పాశవికంగా హతమార్చింది.

పాపను హతమార్చి అనుమానం రాకుండా ఆరోగ్యంగా లేదని ఆస్పత్రికి తీసుకెళ్ళిన తల్లి

పాపను హతమార్చి అనుమానం రాకుండా ఆరోగ్యంగా లేదని ఆస్పత్రికి తీసుకెళ్ళిన తల్లి


కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి ఆడబిడ్డ పాలిట యమదూత గా మారింది. రక్త సంబంధాన్ని మరచిన తల్లి రాక్షసత్వాన్ని చూపించింది. ఆడపిల్ల పుట్టిందని కోపంతో ఆ తల్లి కడుపు తీపిని మరచి పోయింది. కర్కశంగా మారి 5 రోజుల పసిపాపను దారుణంగా చంపేసింది. బొంత లక్ష్మి అనే మహిళ అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో మళ్లీ ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా పసికందు ప్రాణాలు తీసింది. బిడ్డను హతమార్చిన తర్వాత పాప ఆరోగ్యం బాగా లేదని ఆసుపత్రికి తీసుకు వెళ్ళింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పాపం రాత్రికి రాత్రి పూడ్చి పెట్టింది.

ఏఎన్ఎం నిలదీయగా విషయం చెప్పిన తల్లి.. గొంతులో వేలుపెట్టి మరీ హత్య

ఏఎన్ఎం నిలదీయగా విషయం చెప్పిన తల్లి.. గొంతులో వేలుపెట్టి మరీ హత్య


బి లక్ష్మి అనే మహిళ డిసెంబర్ 2న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జిజిహెచ్)లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. డిసెంబర్ 6న లక్ష్మి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. డిసెంబర్ 7న పాప మరణించింది. ఈ క్రమంలో లక్ష్మీ ఇంటికి వచ్చిన ఏ ఎన్ ఎం స్వప్న తల్లిపై అనుమానంతో పాప మృతిపై ఆమెను ప్రశ్నించింది. కాసేపటి తర్వాత పుట్టిన బిడ్డను గొంతులో వేలు పెట్టి హత్య చేసినట్లు లక్ష్మి అంగీకరించింది.

ఇద్దరు ఆడపిల్లలు .. మళ్ళీ ఆడపిల్ల పుట్టటంతో తల్లి ఘాతుకం

ఇద్దరు ఆడపిల్లలు .. మళ్ళీ ఆడపిల్ల పుట్టటంతో తల్లి ఘాతుకం

తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నందున మగపిల్లవాడు పుడతాడు అనుకుంటే మళ్లీ ఆడపిల్ల పుట్టిందని పేర్కొంది. ఆడపిల్ల పుట్టిన కారణంగా తన బిడ్డను చంపినట్లు లక్ష్మి అంగీకరించింది. తాను చేసిన నేరం బయటకు చెబితే ఆత్మహత్య చేసుకుంటానని ఏఎన్ఎం స్వప్నను బెదిరించినట్లు ఆమె పేర్కొంది. అయినప్పటికీ లక్ష్మిపై స్వప్న ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, పసికందు ప్రాణాలు తీసిన తల్లిని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

English summary
The atrocity took place in Guntur district. The tragic incident in which a two-day-old baby girl was strangled to death by her mother came to light recently. Mother committed this atrocity when the new born was a baby girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X