వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుణమాఫీ: కెసిఆర్‌పై మోత్కుపల్లి ఫైర్, బిజెపి ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothkupalli attacks KCR regime on loan waiver
హైదరాబాద్: రుణమాఫీ హామీని తుంగలో తొక్కి రైతుల ఆశలపై నీళ్లు చల్లారనని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు కెసిఆర్‌దే పూర్తి బాధ్యత అని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.

మొదటి హామీనే పక్కదారి పట్టించి రైతులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. గతంలో విద్యార్థులను పొట్టబెట్టుకున్నట్లే ఇప్పుడు రైతాంగాన్నికూడా చంపే ఘనత కెసిఆర్‌కు దక్కుతుందని మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రజలకు ఇచ్చిన హమీలను తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎల్ రమణ విమర్శించారు. హామీలు నెరవేర్చాలంటే సమర్థ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు పొరుగు సేవల ఉద్యోగాల క్రమబద్దీకరణను ప్రభుత్వం పక్కన పెట్టిందని అన్నారు.

ఇదిలావుంటే, రైతు రుణమాపీపై కెసిఆర్ ప్రభుత్వం కాలపరిమితి విధించడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ప్రద్యుమ్నకు కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు.

లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయాల్సిందేనని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీపై అఖిలక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

English summary
Telugudesam party Telangana leader Mothkupalli Narasimhulu lashed out at CM K Chandrasekhar Rao Telangana government on farmers loan waiver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X