వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ దమ్ముందా: కేసీఆర్‌కు టీడీపీ సవాల్, బాబుపై సీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupalli challenges KCR on MLAs resignations
విజయవాడ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు మంగళవారం సవాల్ విసిరారు. టీడీపీ శాసన సభ్యులు ఇందిరా పార్క్ వద్ద రైతుల ఆత్మహత్యలపై ధర్నా చేస్తోంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు మాట్లాడారు.

రైతులను ఆదుకుంటామని, అండగా ఉంటామని, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కొత్త కార్లకు బదులు బాధిత కుటుంబాలకు సాయం చేయాలని రేవంత్ ప్రభుత్వానికి సూచించారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలన్నారు.

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌కు 24 గంటల విద్యుత్ ఇచ్చి రైతులకు రెండు గంటలు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇన్ని ఆత్మహత్యలకు కారకుడైన కేసీఆర్‌ను ఎన్నిసార్లు ఉరితీయాలన్నారు.

చంద్రబాబుపై రామచంద్రయ్య ఆగ్రహం

కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు సీ రామచంద్రయ్య మంగళవారం విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంపై ఆయన వైఖరిని దుయ్యబట్టారు.

విజయవాడలో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం మెట్ట ప్రాంతాలను వదిలేసి పంటపొలాలను ఎంపిక చేయడంపై బాబు ఉద్దేశం ఏంటో బహిర్గతం చేయాలన్నారు. రాజధానిలో కార్పొరేట్ మాఫియా పాదం మోపిందని, దానికి లాభం చేయటమే బాబు ముందున్న తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోందన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పోరాటానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలన్నారు. రాజధానిలో ఇప్పటికే కార్పోరేట్ మాఫియా దిగిందన్నారు. చంద్రబాబుది కార్పోరేట్ కంట్రోల్ ప్రభుత్వంగా కనిపిస్తోందని విమర్శించారు.

English summary
Mothkupalli Narasimhulu challenges KCR on MLAs resignations
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X